
కామారెడ్డిటౌన్ , వెలుగు: కామారెడ్డి జిల్లాలో 71 కేసుల్లో పట్టుబడిన గంజాయి, అర్ఫాజలం , డైజోఫామ్, గంజాయి మొక్కలను ఉన్నతాధికారుల ఆదేశాలతో సోమవారం నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం పడకల్ శివారులోని కెమికల్ ఫ్యాక్టరీలో ధంసం చేసినట్లు ఎక్సైజ్ సూపరిండెంట్ హన్మంత్‌రావు తెలిపారు. 1,285 కిలోల ఎండు గంజాయి, 32 కిలోల అల్పాజోలం, 71 కిలోల డైజోఫామ్, 114 గంజాయి మొక్కలు ధ్వంసం చేశామన్నారు. వీటి విలువ రూ. 7 కోట్ల 98లక్షలు ఉంటుందన్నారు. ఎక్సైజ్ సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.