మార్కెట్ల​ నిర్మాణ పనులు పిల్లర్లు దాటుతలే!

  • మార్కెట్ల​ నిర్మాణ పనులు పిల్లర్లు దాటుతలే!
  • జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో  డెడ్​ స్లో.. 
  • ఫండ్స్​ కొరతతో  పలుచోట్ల ఆగిన నిర్మాణాలు 
  • ఏండ్లు దాటుతున్నా.. నిర్మాణ పనులు ఏడియాడనే..
  •  సౌలత్​లు లేక ఇబ్బందులు పడుతున్నామంటున్న  రైతులు, చిరు వ్యాపారులు 

కామారెడ్డి,  వెలుగు :  జిల్లాలో మున్సిపాలిటీల్లో చేపట్టిన ఇంటిగ్రేటెడ్​ మార్కెట్ ​కాంప్లెక్స్​ నిర్మాణ పనులు డెడ్​ స్లోగా జరుగుతున్నాయి. పనులు త్వరగా పూర్తయి  వినియోగంలోకి వస్తే కూరగాయలు, ఇతర వస్తువులు అమ్ముకోవడానికి  ఈజీ అవుతుందని భావించిన రైతులు, చిరు వ్యాపారులకు నిరాశే మిగులుతోంది. ఫండ్స్​కొరతతోనే  పనుల్లో ఆలస్యం జరుగుతుందని కాంట్రాక్టర్లు చెప్తున్నారు.  

జిల్లాలోని ప్రతి మున్సిపల్​ కేంద్రంలో పట్టణ ప్రజల అవసరాలకనుగుణంగా ఇంటిగ్రేటెడ్​ వెజిటేబుల్, నాన్​ వెజిటేబుల్​ మార్కెట్​ కాంప్లెక్స్​ల  నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటి నిర్మాణానికి  మున్సిపాలిటీలకు కేటాయించిన ఫండ్స్​వినియోగించాలని సూచించింది.  దీంతో మున్సిపల్​అధికారులు జిల్లాలోని  కామారెడ్డి,   బాన్స్​వాడ, ఎల్లారెడ్డి  మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్​ మార్కెట్  కాంప్లెక్స్​ల నిర్మాణం చేపట్టారు. టీయూఎఫ్​ఐడీసీ  కింద వచ్చిన ఫండ్స్​, సీఎం స్పెషల్​గా  శాంక్షన్​ చేసే డెవలప్​మెంట్​ ఫండ్స్​తో ఈ కాంప్లెక్సులు నిర్మిస్తున్నారు.   కామారెడ్డి మున్సిపాలిటీలో రూ. 7.20 కోట్లతో,  బాన్స్​వాడ, ఎల్లారెడ్డిలో రూ. 2కోట్ల చొప్పున ఫండ్స్​తో  పనులు షురూ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన  స్పెషల్​ ఫండ్స్​ సరి పోకపోతే  మున్సిపాలిటీ ఫండ్స్​కూడా వినియోగించుకుని అన్ని రకాల వసతులు కల్పించాలని సూచించారు.  ఆయా చోట్ల పనులు చేపట్టి ఏండ్లు  దాటుతున్నా.. ఇంకా  పిల్లర్ల దశ దాటడం లేదు. 

ప్రస్తుత మార్కెట్​లో రైతుల అవస్థలు

ప్రస్తుతం డెయిలీ మార్కెట్​లో సరైన సౌలత్​లు లేక రైతులు అవస్థలు పడుతున్నారు.  రోడ్లపై కూర్చొని కూరగాయలు  అమ్ముకుంటున్నారు.  గంజు  ఆవరణలో ఇప్పటికే  నిర్మించిన  రైతు బజార్​ను కూడా అధికారులు తెరవడం లేదు. దీంతో  కొనుగోలుదారులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.  ఎల్లారెడ్డిలో రూ. 2 కోట్లతో చేపట్టిన మార్కెట్​ కాంప్లెక్స్​ పనులు ఏడాది కాలంగా  ఫిల్లర్ల దశలోనే ఉన్నాయి.   బాన్స్​వాడలో  శ్లాబ్​పనులు జరుగుతున్నాయి.  

వసతులు లేక ఇబ్బందులు

డెయిలీ మార్కెట్​లో  కూరగాయల అమ్ముతున్నాం కానీ.. సౌలత్​లు లేక ఇబ్బంది పడుతున్నం. రోడ్లపై కూర్చొనే కూరగాయలు అమ్ముకుంటున్నాం.  ఎండా కాలం షురూ కావడంతో  ఎక్కువ సేపు కూరగాయలు అమ్మలేక పోతున్నాం. కూరగాయలు కూడా వాడిపోతున్నాయి.  పెద్ద మార్కెట్​ పనులు తొందరగా పూర్తి చేయాలె. 
- శ్రీనివాస్​, రైతు

2001లో శంకుస్థాపనలు..

కామారెడ్డి పట్టణంలో  గంజు  ఏరియాలో  మార్కెట్  కాంప్లెక్స్​ నిర్మాణానికి  2021 మార్చి 28న స్థానిక ఎమ్మెల్యే  శంకుస్థాపన చేశారు.  మార్కెట్​యార్డ్​లోని షెడ్లను తొలగించి ఇంటిగ్రేటెడ్​ కాంప్లెక్స్​నిర్మాణం చేపట్టారు. ఏడాదిన్నర కావస్తున్నా..  పనులు మాత్రం సగం కూడా  కాలేదు. పిల్లర్లు వేసి శ్లాబ్​ వేయకుండానే వదిలేశారు.   రూ.7.20 కోట్ల అంచనా వ్యయంతో  టీయూఎఫ్​ఐడీసీ ఫండ్స్​ రూ.4.50 కోట్లు,  మిగతా రూ.2.70 కోట్లు  మున్సిపాల్టీ జనరల్ ఫండ్స్​ ఉన్నాయి.   ఇప్పటి వరకు జరిగిన  పనులకు బిల్స్​కూడా రాలేదని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. దీంతో ఆరు నెలలుగా పనులను పూర్తిగా ఆపేశామని చెప్తున్నారు.