కామారెడ్డి విడిచి వెళ్లాలి...రేవంత్ సోదరుడికి పోలీసుల వార్నింగ్

కామారెడ్డిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిని ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని పోలీసుల ఆదేశాలు జారీ చేశారు. దేవునిపల్లిలో నివాసం ఉన్న కొండల్ రెడ్డి ఇంటికి పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఎన్నికల ప్రచారం పూర్తయ్యాక నాన్ లోకల్ వ్యక్తులు కామారెడ్డిలో ఉండకూడదని షరతులు విధించారు. పర్సనల్ ఐడితో ఎందుకు ఉన్నారు..?  ఏ ఏ కారణాలతో ఉండాల్సి వచ్చిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. 

ప్రస్తుతం కొండల్ రెడ్డి ఉంటున్న ఇంటి చుట్టు పోలీసులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రైవేటు వాహనాల్లో పోలీసులు రావడంపై రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేవునిపల్లిలో రెండు గంటలుగా హైడ్రామా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు వాహనాలు ఇచ్చింది ఎందుకని కొండల్ రెడ్డి ప్రశ్నించారు. ప్రైవేట్ వాహనాల్లో రావడం పట్ల తన ప్రాణానికి అపాయం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేస్తానని కొండల్ రెడ్డి చెబుతున్నారు.