కరీంనగర్‌‌‌‌లో కొనుగోళ్ల సందడి

బతుకమ్మ పండుగంటే ఆడపడుచులకు ఎంతో సంబరం. సద్దుల బతుకమ్మ నాడు ఆడపడుచులందరూ పుట్టింట్లో తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో గౌరమ్మను పూజిస్తారు. శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బతుకమ్మ కొనుగోళ్లతో సందడి నెలకొంది. కరీంనగర్‌‌‌‌ సిటీలోని మార్కెట్‌‌లో పూలు కొనేందుకు జనం భారీగా తరలివచ్చారు. 

- వెలుగు ఫొటోగ్రాఫర్, ​కరీంనగర్