మీ అభిమానం తగలెయ్యా : పిల్లాడి ఫొటోషూట్‌లో పేరెంట్స్ పైత్యం

మీ అభిమానం తగలెయ్యా : పిల్లాడి ఫొటోషూట్‌లో పేరెంట్స్ పైత్యం

కర్ణాటకలో హీరో మీద అభిమానంతో ఓ జంట కేసు పాలైంది. చిత్రదుర్గకు చెందిన రేణుకస్వామి(33) హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న కన్నడ హీరో దర్శన్ ఖైదీ నెంబర్ 6106. ఈ నెంబర్ ఇప్పుడు కర్ణాటకలో బాగా వైరల్ అవుతోంది. ఓ జంట వారి పసిబిడ్డకు 6106 ఖైదీ నెంబర్ ఉన్న డ్రెస్ వేసి, చేతులకు సంకెళ్లు వేసి ఫొటో షూట్ చేశారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఈ విధంగా ఫొటో షూట్ చేయడం చట్టవిరుద్ధమని కర్ణాటక బాలల హక్కుల సంఘం సీరియస్ అయ్యింది. బాలుడికి ఖైదీ దుస్తులు, సంకెళ్లు వేసిన తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ సమోటోగా కేసు నమోదు చేసింది. పేరెంట్స్ కు అవగాహన లేక ఫొటో షూట్ ఇలా చేసినా అది జువైనల్ జస్టిస్ చట్టాన్ని ఉల్లంఘించడమేనని కమీషన్ సభ్యుడు శశిధర్ కోసాంబే బుధవారం తెలిపారు. తల్లిదండ్రుల పరారీలో ఉన్నారు.

దర్శన్ ఖైదీ నంబర్ 6106 సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన అభిమానులు ఆ నెంబర్ టాటూ వేయించుకున్నారు. వాహనాలపై 6106 నెంబర్ స్టిక్కరింగ్ వేయించుకుంటున్నారు. వెహికల్ టైటిల్స్ రిజిస్ట్రేషన్ కోసం ఫిల్మ్ ఛాంబర్‌ను కూడా సంప్రదించారు. దీనిపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. దర్శన్ ప్రస్తుతం జూలై 4 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు దర్శన్, పవిత్ర గౌడతోపాటు15 మందిని అరెస్టు చేశారు.