గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉగ్ర రూపం దాల్చింది. ప్రకాశ్ నగర్ వద్ద డేంజర్ లెవల్లో మున్నేరు ప్రవహిస్తోంది. దీంతో ఖమ్మం పట్టణంలోని ఇండ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇళ్ల మధ్య నుంచి మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రకాశ్ నగర్ వద్ద మున్నేరు వాగు గోదావరి నదిని తలపిస్తోంది.
మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండంతో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయికన్ గూడెం వద్ద ముగ్గురు యువకులు వరదల్లో చిక్కుకున్నారు. సిమెంట్ బ్రిక్స్ తయారీ కేంద్రం ఉన్నా ఇల్లును వరద చుట్టుముట్టడంతో ముగ్గురు యువకులు ఇంటిపైకి ఎక్కారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.