ఖమ్మంలో న్యూఇయర్​ జోష్​

2023 సంవత్సరానికి గుడ్​ బై చెప్పి, 2024 సంవత్సరానికి ప్రజలు స్వాగతం చెప్పారు. శనివారం రాత్రి నూతన సంవత్సర వేడుకలు పట్టణంలో ఘనంగా జరిగాయి. యువత  సెలబ్రెషన్స్​తో జాయ్​ఫుల్​గా కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభించారు.  

రాత్రి 12 గంటలకు కేక్ లు కట్ చేసి, ఆనందాన్ని పంచుకున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు స్వీట్ షాప్ లు, బేకరీలు కొనుగోలు దారులతో రద్దీగా కనిపించాయి. హోటల్స్, రెస్టారెంట్ లలో బిర్యానీ లపై వన్ ప్లస్ వన్ ఆఫర్స్​ పెట్టారు. రకరకాల కేకుల మీద కూడా ఆఫర్స్ పెట్టారు. ఇక బార్లు, వైన్ షాప్ లు కూడా రద్దీగా మారాయి.‌‌‌‌ - ఖమ్మం,ఫొటోగ్రాఫర్​, వెలుగు