- త్వరలో గ్రామానికి సోలార్ వెలుగులు
కొడంగల్, వెలుగు : కొడంగల్ మున్సిపాలిటీలోని కొండారెడ్డిపల్లిలో ఫ్రీ సోలార్కరెంట్కు వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. టీజీ ఎస్పీడీసీఎల్(డిస్కం) సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, వికారాబాద్ కలెక్టర్ప్రతీక్ జైన్ గ్రామంలో గురువారం పర్యటించారు.
ఫ్రీ సోలార్ కరెంట్ అందించడానికి కొండారెడ్డిపల్లిని ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసిందన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సమస్యలు ఉంటే మున్సిపల్ ఆఫీస్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్రెడ్డి, సీఈ ఆనంద్పాల్గొన్నారు.