దుర్మార్గానికే దుర్మార్గం : కోడలు నగలన్నీ తీసుకుని.. రోడ్డుపైకి గెంటేసిన అత్తమామలు

దుర్మార్గానికే దుర్మార్గం : కోడలు నగలన్నీ తీసుకుని.. రోడ్డుపైకి గెంటేసిన అత్తమామలు

డబ్బు.. డబ్బు.. డబ్బు.. మానవత్వం తర్వాత సంగతి.. అసలు మనుషులుగానే బిహేవ్ చేయటం జనం.. ఏ కోణంలోనూ డబ్బునే చూస్తున్నారు. కొడుకు, కోడలు, తల్లి బిడ్డ, అత్త మామ అనుబంధాలు అన్నీ మాయం అయ్యాయి అనటానికి ఈ ఘటనే నిదర్శనం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జలాల్ పూర్ లో జరిగిన ఘోరం చర్చనీయాంశం అయ్యింది. ఆ దుర్మార్గులైన భర్త, అత్తమామలను వెంటనే అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జలాల్ పూర్ ఏరియాకు చెందిన రమేశ్ కుమార్ యాదవ్ కు.. అదే ప్రాంతానికి చెందిన రంజనా యాదవ్ తో ఆరు నెలల క్రితం పెళ్లయ్యింది. పెళ్లి సమయంలో ఐదు లక్షల విలువైన బంగారు ఆభరణాలతోపాటు ఫ్రిడ్జ్, కూలర్, పెద్ద మంచం, ఇతర వస్తువులను కట్నకానుకల కింద ఇచ్చారు రంజన పేరంట్స్. అత్తారింట్లో అడుగు పెట్టినప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. పుట్టింటి నుంచి ఐదు లక్షల రూపాయలు తీసుకురావాలంటూ వేధింపులకు గురి చేస్తున్నారు అత్తమామలు, వాళ్లకు భర్త రమేశ్ కుమార్ కూడా మద్దతు ఇచ్చాడు.

వేధింపులు ఎక్కువ కావటంతో ఇటీవలే కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేసింది రంజన. పోలీస్ కంప్లయింట్ ఇచ్చిన తర్వాత హింస ఎక్కువ అయ్యింది. కోడలి దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు కూడా లాక్కుని.. ఇంట్లోని రోడ్డుపైకి గెంటేశారు అత్తమామలు. ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తున్న సమయంలో ఇంటి తలుపులుగా ఉన్న గ్రిల్స్ పట్టుకుని ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అయినా కూడా అత్తమామలు బలవంతంగా కోడలు రంజనాను రోడ్డుపైకి ఈడ్చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ALSO READ | తల్లిదండ్రులను వదిలేస్తే..ఆస్తి బదిలీ రద్దు

దీనిపై పోలీసులు స్పందించారు. కంప్లయింట్ వచ్చిందని.. విచారణ చేస్తున్నామని స్పష్టం చేశారు. కట్నం వేధింపుల కింద కేసులు పెట్టామని.. త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు పోలీసులు. దీనిపై నెటిజన్లు ఆగ్రహంగా ఉన్నారు. వీడియోలో ఇంత స్పష్టంగా ఉన్నా.. ఇంకా చర్యలు తీసుకుంటాం.. విచారణ చేస్తాం అని చెప్పటం ఏంటని పోలీసులను ప్రశ్నిస్తున్నారు. వెంటనే భర్త, అత్తమామలను అరెస్ట్ చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.