గ్వాలియర్: మాస్క్ మస్ట్ అని చెప్పినా కొందరు లైట్ తీసుకుంటున్నారు. అటువంటి వాళ్లకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ పోలీసులు షాకిస్తున్నారు. మాస్క్‌లేకుండా పబ్లిక్ ప్లేస్‌లో కన్పిస్తే హాస్పిటల్లో వాలంటీర్‌గా మూడు రోజులు పనిచేయాలంటూ రూల్ పెట్టారు. అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే మధ్యప్రదేశ్‌లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం కోవిడ్ 19 రూల్స్‌ను స్ట్రిక్ట్‌గా ఫాలో కావాలని ప్రకటించింది. అయినా కొందరు ఈ రూల్స్ పాటించడంలేదని గుర్తించిన అధికారులు.. మాస్క్ పెట్టుకోకున్నా, కోవిడ్ 19 రూల్స్ పాటించకున్నా ఫైన్‌తోపాటు ఏదైనా కోవిడ్ హాస్పిటల్లో లేదా పోలీస్‌చెక్ పోస్టుల దగ్గర మూడు రోజులు పనిచేయాలనే రూల్ పెట్టారు. కరోనా కట్టడి కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘కిల్ కరోనా’ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది.
గల్వానా లోయ నుంచి చైనా సోల్జర్లు వెనక్కి
.