ఈ గుడిలోని బావి నీళ్లు తాగితే రోగాలు నయం అవుతాయా.. భక్తుల విశ్వాసం ఎందుకు..?

మీరు చర్మవ్యాధులు(Skin diseases), ఒళ్లు మంటలు, దురద (Itching)వంటి రోగాలతో బాధపడుతున్నారా? అయితే మీ సమస్యకో చక్కని పరిష్కారం దొరికినట్లే. ఆ బావిలో నీళ్లే మీ బాధలను తొలగించే అద్భుత ఔషదం. అదేంటి బావిలో నీళ్లు..ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని అనుకుంటున్నారా?మీరు చదివించి నిజమే. భారత్ కూప్ అనే బావి(Bharat koop bavi)చర్మవ్యాధులను నయం చేయాడనికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది.  మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్రకూట్ కు 15 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఎలాంటి చర్మ వ్యాధులైనా వదిలించే శక్తి ఆ బావిలోని నీళ్లకు ఉందని ఆ ప్రాంత వాసులకు గట్టి నమ్మకం

చిత్రకూట్ కు  పశ్చిమాన15 కిలోమీటర్ల దూరంలో భారత్ కూప్ అనే బావికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని స్థానికుల ద్వారా తెలుస్తోంది.  పురాణాల్లో కూడా ఈ బావి గురించి పేర్కొన్నారని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.  పండితులు చెప్పిన వివరాల ప్రకారం...  త్రేతాయుగంలో శ్రీరాముడు అడవులకు బయలుదేరినప్పుడు.. అతని సోదరుడు భరతుడు  తన అన్నగారికి అయోధ్యలో రాజ్యాధికారం అప్పగించేందుకు కొన్ని పవిత్రమైన ప్రదేశాల నుంచి నీటిని సేకరించాడని చెబుతున్నారు.  అయితే శ్రీరాముడు  .. భరతుడి ప్రయత్నాన్ని ఒప్పుకోలేదని రామాయణం ద్వారా తెలుస్తుంది.  

అప్పుడు భరతుడు అత్రి మహర్షి  సూచన మేరకు ఈ పవిత్ర జలాన్ని  అక్కడున్న బావిలో పోశాడని.... ఈ బావిలో ఉన్న జలాల మిశ్రమానికి వైద్య లక్షణాలున్నాయని అక్కడి ప్రజలు నమ్ముతారు.  ఈ బావి నీటితో స్నానం చేస్తే అన్ని వ్యాధులు నయమవుతాయని... దీర్ఘకాలిక అనారోగ్యాలకు ఈ బావి నీరు మంచి ఔషధంగా పని చేస్తుందట.  చాలమంది భక్తులు ఇక్కడి నీటిని బాటిల్స్ లో కూడా తీసుకెళ్తుంటారు. పర్యాటకులకు ఈ బావిని దశరథుని కుమారులైన శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అంకింతి చేసి అక్కడ దేవాలయాన్ని నిర్మించారట.  అందుకే దీనిని నలుగురు సోదరుల దేవాయం అని పిలుస్తారని పురాణ గ్రంథాల్లో ఉందని కొంతమంది చెబుతున్నారు. 
ఇక్కడున్న భారత్ కూప్ బావిలో నీరు ఎంతో పవిత్రమైనదని భారత్ మందిర్ పూజారులు తెలిపారు.  

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... 

ఈ బావి నీటికి ప్రత్యేకమైన రుచి ఉంటుందని చెబుతున్నారు.  ఇక్కడ తోడే ఒక్కొక్క బకెట్.. ఒక్కొక్క  రుచి ఉంటుందట.  అయితే  ఈ విషయంపూ స్థానిక అధికారులు ఈ బావిలోని నాలుగు మూలలోని నీటిని సేకరించి టెస్టింగ్ కు ల్యాబ్ కు పంపారు.  ఈ బావిలో అలలు సముద్రంలో మాదిరిగా అలలు ఎగిసిపడతాయని... ఈ బావికి ఆధ్యాత్మిక చరిత్ర ఉందని  చిత్రకూట్ సాధువు శ్రీరామస్వరూపాచార్య తెలిపారు. 

దేశంనలుమూలల నుంచి ఈ బావినీటితో స్నానం చేయడానికి జనాలు తరలి వస్తారట.  ప్రతిరోజు ఈ గ్రామం జాతర వాతావరణాన్ని కలిగి ఉంటుంది.  ఈ పురాతన ఆలయం ఎంతో మహిమకలదని స్థానికులు చెబుతుంటారు.  ఈ ఆలయంలో రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు , శత్రుఘ్నుల లోహ విగ్రహాలున్నాయి.