
ఇన్నాళ్లూ మీ వెనుకున్నాం అన్న అమెరికా ఉక్రెయిన్ కు షాకిచ్చింది. ఐక్యరాజ్యసమితిలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై శాంతిచర్చల తీర్మానం ప్రవేశపెట్టగా.. ఉక్రె యిన్ కు బదులుగా రష్యాకు మద్దతునిచ్చింది.
193 దేశాలున్న ఐక్యరాజ్యసమితిలో శాంతిస్థాపన కోసం సోమవారం(ఫిబ్రవరి24) న ఉక్రెయిన్, ఇతర ఐరోపా దేశాలు ఐక్యరాజ్య సమితిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఈ తీర్మానికి అనుకూలంగా 93 సభ్య దేశాలు ఓటు వేయగా 18 దేశాలు ప్రతికూల ఓటు వేసాయి. మరో 65 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి..ఓటింగ్ లో పాల్గొనకుండా ఇండియా గైర్హాజరయ్యింది.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై మూడేళ్లు ముగిసింది. అయితే శాంతి స్థాపనకోసం ఈ తీర్మానంపై కైవ్‌పై మాస్కోకు మద్దతు ఇచ్చిన వారిలో రష్యా మిత్రదేశాలు బెలారస్, ఉత్తర కొరియా, సూడాన్ ఉన్నాయి.చర్చలు, దౌత్యం ద్వారా వివాదానికి శాంతియుత పరిష్కారం కనుగొనాలని పిలుపునిచ్చిన భారతదేశం ఓటింగ్‌కు దూరంగా ఉంది.