
జవహర్ నగర్, వెలుగు: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఆక్రమ నిర్మాణాలను హెచ్ఏండీఏ, రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. సర్వే నంబర్ 702,708లో ప్రభుత్వ,హెచ్ఏండీఏ భూముల్లో వెలిసిన 10 ఆక్రమ ఇండ్లను మంగళవారం బుల్డోజర్తో కూల్చివేయించారు.
ఈ సందర్బంగా తహసీల్దార్ దివ్యారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ,హెచ్ఏండీఏ భూముల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా గుట్టు చప్పుడు కాకుండా కబ్జాలకు పాల్పడితే వెంటనే రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో హెచ్ఏండీఏ అధికారులు, ఎస్ఐ రాము నాయక్, వేణు మాధవ్, రెవెన్యూ సిబ్బంది రవి, సాయి పాల్గొన్నారు.