ముంబైలోని చెంబూర్ లో సిలిండర్ పేలుడు..9మందికి తీవ్రగాయాలు 

ముంబైలోని చెంబూర్ లో సిలిండర్ పేలుడు..9మందికి తీవ్రగాయాలు 

ముంబై:ముంబై నగరంలోని చెంబూర్ ప్రాంతంలో ఓ ఇంట్లో ఎల్ పీజీ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 6, 2024 ఉదయం 7.30 గంటలకు చెంబూరు లోని సీజీ గిద్వానీ రోడ్ లోని గోల్ప్ క్లబ్ సమీపంలో ఓ సెలూన్ లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 9ఏళ్ల బాలుడితోసహా ఓ మహిళా ఉన్నారు.క్షతగాత్రులను గాయపడ్డవారిని సమీపంలోని  సియోన్, గోవండి శతాబ్ది ఆస్పత్రికి తరలించారు.

గాయపడ్డవారు ఓం లింబాజియా(9), మోహక్(11),  అజయ్ లింబాజియా(33), పూనమ లింబాజియా(33), జ్యోత్స్నాలింబాజియా(53), పీయూష్(25), నితిన్(55), ప్రీతి(34), సుదమ్ శిర్షత్ (55)గా పోలీసులు గుర్తించారు.  అగ్ని మాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రాణ, ఆస్థి నష్టం తగ్గింది. బాధితులను వెంటనే ఆస్పత్రులకు చేర్చడంతో ప్రాణాపాయం తప్పింది.