మునుగోడులో లిక్కర్​ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తలేదు

  • ఈసీ ఆంక్షలతో పార్టీల పక్కదారులు
  • మునుగోడు షాపుల్లో కొన్నది రూ.35 కోట్ల లిక్కరే
  • ఇదిగాక ఇప్పటికే  రూ.100 కోట్లకు పైగా విలువైన మద్యం పంపిణీ
  • జిల్లాల నుంచి యథేచ్ఛగా సరఫరా
  • రూలింగ్​పార్టీ లీడర్లకు చెక్​పోస్టుల్లో పోలీసులు సహకరిస్తున్నారనే అనుమానాలు

నల్గొండ, వెలుగు: మునుగోడు నియోజకవర్గంలో ఏరులై పారుతున్న లిక్కర్​ఎక్కడి నుంచి వస్తుందో అంతుచిక్కడం లేదు. ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరు కున్న ప్రస్తుత తరుణంలో ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచుతున్నాయి.  సీఎం కేసీఆర్​ సభకు భారీగా జనాన్ని తరలించే కార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి అన్ని మండలాల్లో ఓటరుకో క్వార్టర్​ సీసా పంచిపెట్టినట్లు తెలిసింది. బీజేపీ, కాంగ్రెస్​ పార్టీ లు సైతం ఉదయం ప్రచారం, రాత్రి మందు పార్టీలతో ఓటర్లను మత్తులో ముంచుతున్నాయి. ఫ్రీగా మందు వస్తుండడంతో అలవాటు ఉన్నోళ్లు కూడా సొంతంగా కొనుక్కోవడం మానేసి, పార్టీలు పంచిపెడుతున్న సీసాలకే ఎగబడుతున్నారు. కాగా, ఎలక్షన్​ కమిషన్​ లోకల్ మద్యం షాపుల్లో విచ్చలవిడిగా లిక్కర్​ సేల్స్​ జరగకుండా ఆంక్షలు విధించింది. గ్రామాల్లో బెల్టుషాపులు బంద్​ చేయించింది. గతేడాదితో పోల్చినప్పుడు సేల్స్​30శాతం మించవద్దని కండీషన్​ పెట్టింది. అయినప్పటికీ ఊరూరా లీడర్లు పంచుతున్న పెట్టెలకు పెట్టెల లిక్కర్​ ఎక్కడి నుంచి వస్తుందో అర్థంకాక ఆబ్కారీ ఆఫీసర్లు తలపట్టుకుంటున్నారు. 

ఎన్ని ఆంక్షలు పెట్టినా.. 

ఎన్నికల సమయంలో పార్టీలు ఓటర్లను మద్యంతో ప్రలోభపెట్టే అవకాశముండడంతో లిక్కర్​సేల్స్​ పైన ఎలక్షన్​ కమిషన్​ ఆంక్షలు విధించింది. గతేడాది జరిగిన సేల్స్​తో పోలిస్తే ప్రతిషాపులో 30 శాతానికి మించి సేల్స్​జరగడానికి వీల్లేదని నిబంధన పెట్టింది. ఎన్నికల కోడ్​ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ రూల్​ అమలవుతోంది. అంటే ఒక షాపులో గతేడాది 200 కాటన్లు అమ్ముడైతే ఇప్పుడు దానిపైన అదనంగా 60 కాటన్లకు మించి అమ్మడానికి వీల్లేదు. ఈ నిబంధనను పక్కాగా అమలుచేసేందుకు 46 ఫ్లయింగ్​ స్వ్కాడ్​ టీమ్​లు మఫ్టీలో తనిఖీలు చేస్తున్నాయి. మరోవైపు మండలానికి ఒక ఎక్సైజ్​ స్టేషన్​ తరహాలో పోలీస్​, ఎక్సైజ్​ కలి పి 120 మంది సిబ్బందితో చెక్​పోస్టుల వద్ద నిఘా పెట్టారు. రంగారెడ్డి, జనగామ జిల్లాల నుంచి ప్రత్యేకంగా ఎక్సైజ్​ స్టాఫ్​ను రప్పించారు. లోకల్​ సేల్స్​ పైన ఇంతటి కట్టుదిట్టమైన నిఘా ఉంచడంతో వ్యాపారులు సైతం జాగ్రత్త పడుతున్నారు. ఇంత చేసినా గ్రామాల్లో రోజూ జరుగుతున్న మందు పార్టీలు, లిక్కర్​ పంపకాలను చూసి ఎక్సైజ్​ఆఫీసర్లు పరేషాన్​ అవుతున్నారు.  ఎక్సైజ్​ రూల్స్​ ప్రకారం ఒక వ్యక్తికి ఆరు ఫుల్​ బాటిల్స్​ లేదంటే దానికి సమానమైన 24 క్వార్టర్​ సీసాలు, ఒక కాటన్​ బీరు కు మించి ఇవ్వడానికి లేదు.  ఓటర్లకు పంచడానికి ఇది ఏ మూలకూ చాలడం లేదు. దీంతో అక్రమ మార్గంలో మునుగోడుకు లిక్కర్​ డంప్​ చేస్తున్నట్లు ఆబ్కారీ ఆఫీసర్లు అనుమానిస్తున్నారు. రంగారెడ్డి, సిద్ధి పేట, హైదరాబాద్​ జిల్లాల నుంచి డీసీఎంలు, కార్లలో పెద్ద ఎత్తున లిక్కర్​ సప్లై జరుగుతోందని, రూలింగ్ ​పార్టీకి  చెందిన పలువురు మంత్రుల సపోర్ట్​తో చెక్​పోస్టుల వద్ద పోలీసులు చూసీచూడనట్లు వదిలేస్తుండడం వల్లే లిక్కర్​ నియోజకవర్గంలోకి ఎంటర్​ అవుతోందని ఓ సీనియర్​ అధికారి 'వెలుగు'తో చెప్పారు. 

కనిపెట్టడం పెద్ద కష్టం కాదు.. 

ఓటర్లకు పంచుతున్న లిక్కర్​ ఎక్కడిదో తెలుసుకోవడం ఆబ్కారీ ఆఫీసర్లకు పెద్ద కష్టం కాకపోయినప్పటికీ వాళ్లపై ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో తాగిపడేస్తున్న బాటిళ్లలో  బ్లెండర్​ స్ర్పైడ్​, రాయల్​​ స్టాగ్​, రాయల్​ చాలెంజ్​, ఇంపీరియల్​ బ్లూ లాంటి బ్రాండ్లే ఎక్కువ ఉంటున్నాయి. వాటి బాటిళ్ల పైన లేబుల్స్​, సీరియల్​ నంబర్స్ ​ఎలాగూ ఉంటాయి. వాటి ఆధారంగా ఎంక్వైరీ చేస్తే ఆ లిక్కర్​ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిపోతుంది. కానీ తమకు ఆ అవకాశం లేకుండా పోయిందని, పై నుంచి ఆదేశాలు వస్తే తప్ప తాము ఆ పని చేయలేమని మరో ఆఫీసర్​ పేర్కొన్నారు.  

ఎన్ని ఆంక్షలు పెట్టినా.. 

ఎన్నికల సమయంలో పార్టీలు ఓటర్లను మద్యంతో ప్రలోభపెట్టే అవకాశముండడంతో లిక్కర్​సేల్స్​ పైన ఎలక్షన్​ కమిషన్​ ఆంక్షలు విధించింది. గతేడాది జరిగిన సేల్స్​తో పోలిస్తే ప్రతిషాపులో 30 శాతానికి మించి సేల్స్​జరగడానికి వీల్లేదని నిబంధన పెట్టింది. ఎన్నికల కోడ్​ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ రూల్​ అమలవుతోంది. అంటే ఒక షాపులో గతేడాది 200 కాటన్లు అమ్ముడైతే ఇప్పుడు దానిపైన అదనంగా 60 కాటన్లకు మించి అమ్మడానికి వీల్లేదు. ఈ నిబంధనను పక్కాగా అమలుచేసేందుకు 46 ఫ్లయింగ్​ స్వ్కాడ్​ టీమ్​లు మఫ్టీలో తనిఖీలు చేస్తున్నాయి. మరోవైపు మండలానికి ఒక ఎక్సైజ్​ స్టేషన్​ తరహాలో పోలీస్​, ఎక్సైజ్​ కలి పి 120 మంది సిబ్బందితో చెక్​పోస్టుల వద్ద నిఘా పెట్టారు. రంగారెడ్డి, జనగామ జిల్లాల నుంచి ప్రత్యేకంగా ఎక్సైజ్​ స్టాఫ్​ను రప్పించారు. లోకల్​ సేల్స్​ పైన ఇంతటి కట్టుదిట్టమైన నిఘా ఉంచడంతో వ్యాపారులు సైతం జాగ్రత్త పడుతున్నారు. ఇంత చేసినా గ్రామాల్లో రోజూ జరుగుతున్న మందు పార్టీలు, లిక్కర్​ పంపకాలను చూసి ఎక్సైజ్​ఆఫీసర్లు పరేషాన్​ అవుతున్నారు.  ఎక్సైజ్​ రూల్స్​ ప్రకారం ఒక వ్యక్తికి ఆరు ఫుల్​ బాటిల్స్​ లేదంటే దానికి సమానమైన 24 క్వార్టర్​ సీసాలు, ఒక కాటన్​ బీరు కు మించి ఇవ్వడానికి లేదు.  ఓటర్లకు పంచడానికి ఇది ఏ మూలకూ చాలడం లేదు. దీంతో అక్రమ మార్గంలో మునుగోడుకు లిక్కర్​ డంప్​ చేస్తున్నట్లు ఆబ్కారీ ఆఫీసర్లు అనుమానిస్తున్నారు. రంగారెడ్డి, సిద్ధి పేట, హైదరాబాద్​ జిల్లాల నుంచి డీసీఎంలు, కార్లలో పెద్ద ఎత్తున లిక్కర్​ సప్లై జరుగుతోందని, రూలింగ్ ​పార్టీకి  చెందిన పలువురు మంత్రుల సపోర్ట్​తో చెక్​పోస్టుల వద్ద పోలీసులు చూసీచూడనట్లు వదిలేస్తుండడం వల్లే లిక్కర్​ నియోజకవర్గంలోకి ఎంటర్​ అవుతోందని ఓ సీనియర్​ అధికారి 'వెలుగు'తో చెప్పారు. 

కనిపెట్టడం పెద్ద కష్టం కాదు.. 

ఓటర్లకు పంచుతున్న లిక్కర్​ ఎక్కడిదో తెలుసుకోవడం ఆబ్కారీ ఆఫీసర్లకు పెద్ద కష్టం కాకపోయినప్పటికీ వాళ్లపై ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో తాగిపడేస్తున్న బాటిళ్లలో  బ్లెండర్​ స్ర్పైడ్​, రాయల్​​ స్టాగ్​, రాయల్​ చాలెంజ్​, ఇంపీరియల్​ బ్లూ లాంటి బ్రాండ్లే ఎక్కువ ఉంటున్నాయి. వాటి బాటిళ్ల పైన లేబుల్స్​, సీరియల్​ నంబర్స్ ​ఎలాగూ ఉంటాయి. వాటి ఆధారంగా ఎంక్వైరీ చేస్తే ఆ లిక్కర్​ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిపోతుంది. కానీ తమకు ఆ అవకాశం లేకుండా పోయిందని, పై నుంచి ఆదేశాలు వస్తే తప్ప తాము ఆ పని చేయలేమని మరో ఆఫీసర్​ పేర్కొన్నారు.  జకవర్గంలోని మద్యం షాపుల్లో28వేల కాటన్ల  లిక్కర్, 49 వేల కాటన్ల బీర్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఇవే తేదీల్లో  26 వేల కాటన్ల లిక్కర్​, 39 వేల కాటన్ల బీర్లు అమ్ముడయ్యాయి. అంటే గతేడాదితో పోలిస్తే 2వేల కాటన్ల లిక్కర్​, 10వేల కాటన్ల బీరు మాత్రమే ఎక్కువ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. కానీ మూడు వారాలుగా నియోజకవర్గంలో ఊరూరా మద్యం ఏరులై పారుతోంది. ప్రచారం, సభలు, సమావేశాలకు వచ్చే వేలాది మందికి ప్రధాన పార్టీలు లిక్కర్​పంచడం పరిపాటిగా మారింది. రూలింగ్​పార్టీ తరుపున ఎమ్మెల్యేలు, మంత్రులు ఇన్​చార్జిగా ఉన్న గ్రామాల్లో ప్రతి రోజూ ఇంటింటికీ మటన్​ లేదంటే చికెన్​తో పాటు మందు బాటిల్​ వెళ్తోందనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఎక్సైజ్​ ఆఫీసర్లు.. మునుగోడులో పంచిన సరుకు విలువ ఇప్పటికే రూ. 100 కోట్లు దాటి ఉంటుందని, కానీ మద్యం షాపుల ద్వారా అమ్ముడుపోయిన సరుకు కేవలం రూ.35 కోట్లు మాత్రమేనని చెప్తున్నారు.

కొన్నది రూ.35 కోట్లు.. పంచింది రూ.100 కోట్లకు పైనే..