కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య టికెట్లు, వర్గ పోరు మళ్లీ తీవ్రమైంది. లీడర్లు బహిరంగంగానే బాహాబాహీకి దిగుతున్నారు.. కలబడుతున్నారు. గాంధీభవన్‌కు వచ్చి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. గోడలపై పోస్టర్లూ వేసుకుంటున్నారు. దాదాపు 20 నియోజకవర్గాల్లో గ్రూపు లొల్లులు ఎక్కువయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రూపు పంచాయితీలు ఇట్లనే కొనసాగితే.. టికెట్ఇచ్చిన అభ్యర్థులకు ఎదుటివర్గం సహకరిస్తుందా? అని పార్టీ పెద్దల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లొల్లి పెట్టుకుంటున్న నేతలకు గాంధీభవన్ నుంచి వార్నింగ్‌లు వెళ్తున్నా.. నివురుగప్పిన నిప్పులా రాజుకుంటూనే ఉన్నది.
కొందరు లీడర్లు తమ తీరును మార్చుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు పార్టీలోని పెద్ద నేతల మధ్యనే సఖ్యత లేకపోవడం కేడర్‌ను ఇంకింత కలవరపాటుకు గురిచేస్తున్నది.
ALSO READ:మంచిర్యాల టికెట్ బీసీలకే ఇవ్వాలి.. బీసీ రాజ్యాధికార ఐక్యవేదిక ఆధ్వర్యంలో దీక్ష
ఇటీవలి కాలంలో బాగా హాట్ టాపిక్ అయిన నియోజకవర్గం మునుగోడు. ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. బై పోల్‌లో పోటీకి కాంగ్రెస్ తరఫున చెల్లమల్ల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి, పున్నా కైలాష్ నేత టికెట్ ఆశించారు. చివరికి పాల్వాయి స్రవంతికి టికెట్ ఇచ్చారు. అయితే, ఆమె ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల నడుమ ట్రయాంగిల్ ఫైట్ నడుస్తున్నది. చలమల్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వొద్దని ఎదుటి వర్గం నేతలు పట్టుబడుతున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే సహకరించబోమని తేల్చి చెప్తున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోనూ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ చీఫ్ శంకర్‌నాయక్ మధ్య గొడవ జరుగుతున్నది.
కొద్ది నెలల కింద ఓ మీటింగ్‌లో రెండు వర్గాల వాళ్లు చైర్లతో కొట్టుకున్నారు. అదికూడా గాంధీభవన్ వరకు చేరింది. ఇప్పుడు ఆ ఇద్దరూ మిర్యాలగూడ టికెట్‌కు అప్లై చేసుకున్నారు. వాళ్లతో పాటు జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి కూడా మిర్యాలగూడ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. జానారెడ్డికి శంకర్‌నాయక్ చాలా దగ్గరని పేరు. చాలా సందర్భాల్లో గొడవలు జరిగినప్పుడు శంకర్‌నాయక్‌ను ఆయన వెనకేసుకొచ్చారన్న వాదనలూ ఉన్నాయి.