సిద్దిపేట(నంగునూరు), వెలుగు: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. గ్రామానికి చెందిన ఎండీ రఫీక్, శనిగరం కనకయ్య, నాగిరెడ్డి, రాజిరెడ్డి తమ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సిద్దిపేట–హన్మకొండ రోడ్ సమీపంలో పాలమాకుల గ్రామ శివారులో ‘మంత్రి హరీశ్ రావు గారు.. నిరుపేదలమైన మేము ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు అర్హులము కామా? మాకెందుకు ఇవ్వరు’ అంటే ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
తమకు మైనార్టీలోన్, డబుల్ బెడ్రూమ్, బీసీ లోన్, గృహలక్ష్మి లాంటి పథకాలు అందవా? అని ప్రశ్నించారు. ఈ ఫ్లెక్సీని స్థానికులు ఆసక్తిగా చూస్తున్నారు.