- రాష్ట్ర సంగీత, నాట్య కళామండలి చైర్పర్సన్ అలేఖ్య పుంజల
నారాయణపేట, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర సంగీత, నాట్య కళామండలి చైర్పర్సన్ అలేఖ్య పుంజల పిలుపునిచ్చారు. బుధవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేశ్ గౌతమ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్ వార్ల విజయ్ కుమార్ము
న్సిపల్ చైర్పర్సన్ గందే అనసూయ తదితరులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని, సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయిని, ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాలపై నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది.