నెహ్రూ జులాజికల్ పార్క్లో.. మగ జిరాఫీ సునామీ బసంత్​మృతి

నెహ్రూ జులాజికల్ పార్క్లో.. మగ జిరాఫీ సునామీ బసంత్​మృతి
  • 2004 సునామీ టైంలో జన్మించిన జిరాఫీ 
  • 2009లో ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఛేంజ్​లో భాగంగా ఢిల్లీ నుంచి సిటీకి రాక  
  • జూపార్కులో మిగిలింది ఇక ఒక్క జిరాఫీనే..

హైదరాబాద్​సిటీ, వెలుగు: సిటీలోని నెహ్రూ జూలాజికల్​పార్కులో 15 ఏండ్లపాటు సందర్శకులను ఆకట్టుకున్న మగ జిరాఫీ ‘సునామీ బసంత్’ సోమవారం రాత్రి 11.30 గంటలకు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. 

వయోభారం కారణంగానే కన్నుమూసిందని మంగళవారం ఓ ప్రకటనలో చెప్పారు. 2004లో సునామీ సమయంలో ఢిల్లీలోని నేషనల్​జూలాజికల్​పార్క్​లో ఈ జిరాఫీ జన్మించింది.

 అందుకే సునామీ బసంత్​అని పేరు పెట్టారు. పార్కుల మధ్య జంతుల ఎక్స్​ఛేంజ్​కార్యక్రమంలో భాగంగా ఈ జిరాఫీని 2009లో హైదరాబాద్​జూ పార్క్​కు తీసుకువచ్చారు. రెండేండ్లుగా సునామీ బసంత్​ఆర్థ్రయిటీస్ తో బాధపడుతోంది. వెటర్నరీ డాక్టర్లు ఎంఏ హకీం పర్యవేక్షణలో చికిత్స జరిగింది. అయినా దాని ప్రాణాలు దక్కలేదు.  

ఇక ఒక్క జిరాఫీనే..

సునామీ బసంత్​మరణంతో ప్రస్తుతం హైదరాబాద్ జూ పార్క్​లో కేవలం ఒకేఒక్క మగ జిరాఫీ(సన్నీ) మాత్రమే ఉందని అధికారులు తెలిపారు. రాజేంద్ర నగర్ వీబీఆర్ఐ, వెటర్నరీ కాలేజీ నిపుణులు, సీసీఎంబీకి చెందిన వైద్యనిపుణుల సమక్షంలో సునామీ బసంత్​పోస్ట్​మార్టం నిర్వహించారు. తదుపరి పరీక్షల నిమిత్తం నమూనాలను వీబీఆర్ఐకి అందజేశారు.

 హైదరాబాద్​జూ పార్క్​ డైరెక్టర్​డా.సునీల్​ఎస్​ హిరేమత్​ఇతర స్టాఫ్​ మెంబర్స్​ జిరాఫీకి ఘన నివాళులర్పించారు. డైరెక్టర్​సునీల్​హిరేమత్​మాట్లాడుతూ జూ పార్క్​కు ఒక స్టార్​అట్రాక్షన్​గా ఉన్న జిరాఫీ సునామీ బసంత్​ మరణించడం బాధించిందన్నారు.