నెక్కొండ, వెలుగు : వరంగల్జిల్లా నెక్కొండ పట్టణంలో గల దుర్గా పెట్రోల్ బంకులో కల్తీపెట్రోల్ అమ్ముతున్నారని, బంకును సీజ్చేయాలంటూ వాహనదారులు వరంగల్-నెక్కొండ మెయిన్‌రోడ్డుపై ధర్నాచేశారు. సోమవారం సుమారు 30 మంది పెట్రోలు పోసుకొని వెళ్లగా.. వరంగల్, తొర్రూరుకు వెళ్లే మార్గమధ్యలోనే బైక్‌లు మొరాయించాయి. దీంతో వాళ్లు బంకుకు వచ్చి సిబ్బందిని నిలదీశారు. సిబ్బంది పొంతన లేని సమాధానం చెప్పారు.
ALSO READ : 27న ఖమ్మం జిల్లాకు..అమిత్ షా : సుధాకర్ రెడ్డి
అనుమానం వచ్చి బాటిళ్లలో పెట్రోలు పోసి చూశారు. అది కల్తీ పెట్రోల్ అని నిరసన వ్యక్తం చేశారు. యజమానిపై చర్యలు తీసుకునేవరకు ఆందోళన విరమించేదిలేదని రోడ్డుపై బైఠాయించారు. ఎస్సై షేక్జానీపాష అక్కడి చేరుకొని, ఓనర్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు.