- ఇందూరు జిల్లాలో పది పరీక్షల ఫలితాల్లో 92.71 శాతం ఉత్తీర్ణత
- పదిలో స్టేట్‌లో నిరుడు7.. ఈసారి 14వ స్థానం
- 132 మంది స్టూడెంట్స్‌కు 10 జీపీఏ
- వంద శాతం ఫలితాలతో గురుకులం స్కూల్స్ హవా..
నిజామాబాద్, వెలుగు : జిల్లాలో 21,858 మంది స్డూడెంట్స్ టెన్త్ పరీక్షలు రాయగా 20,486 మంది పాస్ అయ్యారు. 93.72 శాతం రిజల్టు వచ్చింది. గర్ల్స్ 10,714 మంది ఎగ్జామ్స్ రాయగా 10,156 ఉత్తీర్ణత సాధించి (94.79 శాతం) ఎప్పటిలాగే ఆధిక్యత చాటారు. 11,144 మంది బాయ్స్ పరీక్షలు రాయగా 10,330 మంది (92.70 శాతం) పాసయ్యారు. స్టేట్ రిజల్టులో జిల్లా 14 స్థానం పొందింది.
మొత్తం 727 హైస్కూల్స్ జిల్లాలో గవర్నమెంట్, ప్రైవేట్ కలిపి 727 హైస్కూల్స్ ఉన్నాయి. గతేడాది 87 శాతం అంతకు ముందు సంవత్సరంలో 92 శాతం ఉత్తీర్ణత సాధించిన జిల్లాలో ఈసారి కాస్త మెరుగ్గా 93.72 శాతం రిజల్టు నమోదైంది.
మెరిసిన జ్యోతిబాపూలె స్కూళ్లు
మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల స్టూడెంట్లు పది పరీక్ష ఫలితాల్లో మెరిశారు. మొత్తం19 స్కూళ్లలో 16 వంద శాతం రిజల్టు సాధించాయి. 1221 మంది పరీక్షలు రాయగా 1211 పాస్ అయ్యారు. వారిలో 45 మంది10 జీపీఏ నమోదు చేశారు.
ఎస్సెస్సీ రిజల్టులో నిరాశపర్చిన కామారెడ్డి
కామారెడ్డి: ఎస్సెస్సీ ఎగ్జామ్స్ రిజల్టులో స్టేట్‌లో కామారెడ్డి జిల్లా స్థానం పడిపోయింది. నిరుడు స్టేట్‌లో 7వ స్థానం ( 93.32 శాతం), ఈ సారి 19వ స్థానం ( 92.71 శాతం) వచ్చింది. ఈ సారి మొత్తం 11, 926 మంది ఎగ్జామ్స్‌కు హాజరవ్వగా 11,057 మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు. వీరిలో అమ్మాయిలు 6,047 మందికి గాను
5,706 మంది ఫాస్ కాగా, అబ్బాయిలు 5,879 మందిలో 5,351 మంది పాస్ అయ్యారు. నిరుటి కంటే ఈ సారి 0.61 శాతం ఉత్తీర్ణత తగ్గింది. 132 మంది స్టూడెంట్స్ 10 జీపీఏ సాధించారు. వీరిలో 47 మంది గవర్నమెంట్ స్కూల్స్, 85 మంది ప్రైవేట్ స్కూల్స్ స్టూడెంట్స్ ఉన్నారు.
బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో 100 శాతం ఫాస్
జిల్లాలోని బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో స్టూడెంట్స్ 100 శాతం ఉత్తీర్ణత పొందారు. 384 మంది స్టూడెంట్స్‌కు గాను అందరు పాస్ అయ్యారు. మైనార్టీ రెసిడెన్షియల్లో 245 మందిలో 241 మంది ( ( 98.37 శాతం) పాస్‌అయ్యారు. సోషల్ వెల్పేర్‌లో 836కు గాను 828 మంది( 99.04 శాతం) , ట్రైబల్ వెల్ఫేర్‌లో 314 మందిలో 308 మంది ( 98.09 శాతం) , రెసిడెన్షియల్ స్కూల్లో 53 మందిలో 52 మంది ( 98.11 శాతం) , మాడల్స్కూల్స్లో 575 మందిలో 555 మంది
( 96.52 శాతం) , కస్తూర్భాలో 720 మందిలో 679 మంది ( 94.31 శాతం), ఎయిడెడ్‌లో 18 మందిలో 14 ( 77.78 శాతం), గవర్నమెంట్లో 360 మందిలో 304( 84.44 శాతం), జడ్పీ హైస్కూల్స్‌లో 6,198 మందిలో 5,503 మంది ( 88.79 శాతం) పాస్ అయ్యారు. 66 గవర్నమెంట్ స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణత వచ్చింది.