భువనేశ్వర్ : ఒడిశాలో ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. శనివారం సాయంత్రం కొరాపుట్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈ సమయంలో 7 నిమిషాల వ్యవధిలోనే 15 వేల సార్లు మెరుపులు వచ్చాయి.
మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఈ విషయాన్ని ‘దామిని’ యాప్ లో వెల్లడించింది. ఇది అరుదైన రికార్డు అని తెలిపింది. కోరాపుట్ జిల్లాలో 15 వేల మెరుపుల రికార్డును ఐఎండీ కూడా కన్ఫామ్ చేసింది. ఇలాంటి పరిస్థితి చాలా తక్కువ సందర్భాల్లో ఉంటుందని పేర్కొంది.