
ఇటీవల రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పిన రెజ్లర్ వినేస్ ఫొగట్..తన కేరీర్ పై కీలక ప్రకటన చేసింది. 2032 వరకు తాను రెజ్లింగ్ కొనసాగుతానని చెప్పింది.సోషల్ మీడి యాలో ప్లాట్ ఫాం Xలో తన ఉద్వేగభరితమైన పోస్ట్ ను షేర్ చేసింది. తనలో పోరాట పటిమ ఇంకా ఉందని.. నాలో కుస్తీ ఎప్పుడూ ఉంటుంది..భవిష్యత్ నా కేరీర్ ను ఎలా నిర్ణయిస్తుందో తెలియదు గానీ.. తాను నమ్ముకున్న దానికోసం ఎప్పుడూ పోరాతూనే ఉంటానని ’’ చెప్పింది.
— Vinesh Phogat (@Phogat_Vinesh) August 16, 2024
పారిస్ ఒలింపిక్స్ 2024 నుంచి అనర్హురాలిగా ప్రకటించిన తర్వాత రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పింది. అయితే మనసు మార్చుకున్న వినేష్ ఫొగట్.. శుక్రవారం ఆగస్టు 16, 2024న రెజ్లింగ్ వృత్తిని 2032 వరకు కొనసాగిస్తానని X ద్వారా తెలిపింది. సోషల్ మీడియాXలో పోస్ట్ చేసిన బహిరంగ లేఖలో.. వినేష్ తన ఇటీవలి రిటైర్మెంట్ ప్రకటన దురదృష్టకర పరిస్థితులలో వచ్చిందని రాశారు. పారిస్ ఒలింపిక్స్‌లో 50 కేజీల కేటగిరీ ఫైనల్‌లో 100 గ్రాముల స్వల్ప బరువు ఎక్కువగా ఉన్నందున వినేష్‌కు స్వర్ణం కోసం పోరాడే అవకాశం లేకుండా పోయింది.