ప్రమాణ స్వీకారానికి ముందే తనమార్క్ చూపిస్తున్న జగన్

ప్రమాణ స్వీకారానికి ముందే తనమార్క్ చూపిస్తున్న జగన్

ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే జగన్ తన మార్క్ పాలన ఏంటో చూపిస్తున్నారు. తమ ఫ్యామీలీకి సెక్యూరిటీ పై కంప్లైయింట్ ఇచ్చిన గంటల్లోనే మాజీ మంత్రి పరిటాల సునీతకు సెక్యూరిటీ పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఎనమిది మంది అదనపు గన్ మెన్లను నియమిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందు  పరిటాల సునీత.. ఆమె కుమారుడు శ్రీరాములు అనంతపురం జిల్లాలోని తమ స్వగ్రామమైన వెంకటాపురంలో మీడియాతో మాట్లాడుతూ..తమ కుటుంబ భద్రత మీద అనుమానాలు వ్యక్తం చేశారు.కొత్త ప్రభుత్వంలో ఏర్పడే పరిస్థితుల మీద వారు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.