ధరలను అదుపులో ఉంచేందుకు.. 71 వేల టన్నుల ఉల్లి కొనుగోలు

 ధరలను అదుపులో ఉంచేందుకు.. 71 వేల టన్నుల ఉల్లి కొనుగోలు

న్యూఢిల్లీ: ఉల్లిపాయల ధరలను  కంట్రోల్లో ఉంచేందుకు ప్రభుత్వం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 71 వేల టన్నుల ఉల్లిపాయలను అదనపు నిల్వలుగా సేకరించిం ది. ఈ ఏడాది 5 లక్షల టన్నుల ఉల్లిని సేకరించాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌ పెట్టుకుంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతుండడంతో   రానున్న నెలల్లో ఉల్లిపాయల ధరలు దిగొస్తాయని అంచనా వేస్తోంది.

కన్జూమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అఫైర్స్ డిపార్ట్​మెంట్​ డేటా ప్రకారం,  దేశం మొత్తం మీద కేజి ఉల్లి ధర సగటున రూ.40 గా ఉంది. ఈ ఏడాదిలో ఈ నెల 20 వరకు 70,071  టన్నుల ఉల్లిపాయలను సేకరించామని, కిందటేడాది ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌లో 74,071 టన్నుల ఉల్లిని సేకరించామని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఖరీఫ్‌‌‌‌‌‌‌‌, రబీ సీజన్లలో  ఉల్లిపాయల ప్రొడక్షన్ 20 శాతం తగ్గిందని అంచనా.

 కాగా, ఉల్లిపాయల ధరలు భారీగా పెరిగితే ప్రభుత్వం అదనపు నిల్వలను వాడి ధరలను కంట్రోల్లో ఉంచుతుంది.  ఉల్లిపాయల ఎగుమతులపై కిందటేడాది ఆగస్టు నుంచి నియంత్రణలు  కొనసాగిస్తోంది. 40 శాతం  ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ డ్యూటీని విధించడంతో పాటు, మినిమమ్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ ప్రైస్ (ఎంఈపీ) ని టన్నుకి 800 డాలర్లుగా నిర్ణయిం చింది. అంటే ఈ రేటు కంటే తక్కువకు ఎగుమతి చేయకూడదని అర్థం.