మల్చింగ్​ పద్ధతిలో పంటల సాగుపై రైతుల మొగ్గు!  : పాలేరు నియోజకవర్గంలో 1000 ఎకరాల్లో పంటల సాగు

మల్చింగ్​ పద్ధతిలో పంటల సాగుపై రైతుల మొగ్గు!  : పాలేరు నియోజకవర్గంలో 1000 ఎకరాల్లో పంటల సాగు
  • పాలేరు నియోజకవర్గంలో 1000 ఎకరాల్లో పంటల సాగు
  • ప్రభుత్వం నుంచి ఒక హెక్టర్ కు రూ.16వేల సబ్సిడీ

కూసుమంచి, వెలుగు  :  పాలేరు నియోజకవర్గంలో ఈ ఏడాది రైతులు ఆధునీక పద్ధతులపై దృష్టిసారించారు. మల్చింగ్​ పద్ధతిలో పంటల సాగుపై మొగ్గు చూపుతున్నారు. ఈ పద్ధతిలో కూసుమంచి, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో ఈసారి 1000 ఎకరాల్లో మిరప, కూరగాయలు, పుచ్చకాయలు లాంటి వివిధ పంటలు సాగు చేస్తున్నారు. నీటి ఆవిరి కాకుండా రంధ్రం వద్దే మొక్కలు నీటిని పీల్చుకుంటాయి.

బింధు సేధ్యం వాడకం వల్ల నీటి ఆదా 40 నుంచి 50శాతం ఉంటుందని రైతులు చెబుతున్నారు. మల్చింగ్ సాగులో ముఖ్యంగా కలుపు నివారణ చేయవచ్చు. భూమి ద్వారా వచ్చే తెగుళ్లను అరికట్టవచ్చు. కూలీల ఖర్చును తగ్గించుకోవచ్చు. మల్చింగ్ పేపర్ కు ఖర్చు రూ. 15 వేలు, బిందుసేద్యం కోసం రూ.25వేలు ఖర్చు ఉంటుంది. అయితే దీనికి ప్రభుత్వం నుంచి ఒక హెక్టర్ కు రూ.16వేలు సబ్సీడీ ఇస్తుంది. అందుకు ఎక్కువ మంది రైతులు మల్చింగ్ సాగుపై ఇంట్రెస్ట్​ పెడుతున్నారు.