రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి చిరుత కలకలం 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి చిరుత కలకలం రేపింది. తంగళ్ళపల్లి మండలం గోపాల్ రావు పల్లె గ్రామ శివారులోని ఓ షెడ్డులో కట్టేసిన లేగ దూడ పై చిరుత దాడి చేసి చంపేసింది. చిరుత పులి సంచరించిన పాద ముద్రలను గమనించిన గ్రామస్తులు.. వెంటనే ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. తరచూ ఎక్కడో ఒకచోట చిరుత కనిపిస్తుండడంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.