దివ్యాంగుడైన కొడుకుపై కసాయి తండ్రి వివక్ష.. వదిలేసి రావాలని భార్యకు ఆర్డర్..

దివ్యాంగుడైన కొడుకుపై కసాయి తండ్రి వివక్ష.. వదిలేసి రావాలని భార్యకు ఆర్డర్..
  • న్యాయపోరాటానికి దిగిన భార్య 
  • బంధువులతో కలిసి భర్త ఇంటి ముందు బైఠాయింపు 

హైదరాబాద్: దివ్యాంగుడిని కన్నావంటూ భార్యను దూరం పెట్టాడు ఓ కసాయి భర్త.. మానవత్వం మంటగలిపే ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. అత్తాపూర్ డివిజన్ హైదర్ గూడలో భర్త ఇంటిముందు కొడుకుతో కలిసి న్యాయపోరాటానికి దిగింది బాధితురాలు వివరాల్లోకి వెళితే.. 

 అత్తాపూర్ డివిజన్ పరిధిలోని హైదర్ గూడకు చెందిన బాధితురాలు అలేఖ్యకు దివ్యాంగుడైన కొడుకు జన్మించాడు. అయితే దివ్యాంగుడైన కొడుకును వదిలేసి వస్తేనే.. ఇంటికి రావాలని అలేఖ్య భర్త ఉదయ్ కుమార్ షరతు పెట్టాడు. ఇందుకు అలేఖ్య ఒప్పుకోకపోవడంతో ఆమెను ఇంటికి రావొద్దని వదిలివెళ్లాడు. కన్న కొడుకును అలా ఎలా వదిలేయాలి.. అని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. 

దీంతో బాధితురాలు భర్త ఉదయ్ కుమార్ ఇంటిముందు న్యాయపోరాటానికి దిగింది. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి భర్త ఇంటి ముందుకు బైఠాయించింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులకు, భర్త కుటుంబ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.