బేకరీ బ్రెడ్‍ ప్యాకెట్‪లో వెంట్రుకలు, చిత్తు కాగితాలు

బేకరీ బ్రెడ్‍ ప్యాకెట్‪లో వెంట్రుకలు, చిత్తు కాగితాలు

రంగారెడ్డి జిల్లా : ఫుడ్ సేఫ్టీ అధికారులు తరుచూ దాడులు చేస్తున్నా.. హోటల్ యాజమాన్యాలు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. నిత్యం ఏదో ఒక కల్తీ ఆహరం పదార్థాలు వార్తల్లో కనిపిస్తూనే ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలో తాజాగా బ్రెడ్ ప్యాకెట్ లో వెంట్రుకలు, చిత్తు కాగితాలు కలకలం రేపింది. మంగళవారం(జూలై 16, 2024) నాడు నార్సింగి పరిధిలోని మోరిన్ బేకరీలో ప్యాక్ చేసిన బ్రెడ్ కవర్ నుంచి వెంట్రుకలుతోపాటు చిత్తు కాగితాలు బయటకు పడ్డాయి. 

ALSO READ | కోట్ పల్లి కోళ్లఫామ్​లో గుట్కా తయారీ

ఓ కస్టమర్ కొనుగోలు చేసిన బ్రెడ్ తింటుండగా వెంట్రుకలు నోటిలోకి వెళ్లాయి. అది చూసి కస్టమర్ షాక్ తిన్నాడు. విషయం బయటకు తెలియకుండా బేకరి నిర్వాహకులు మీడియాకు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అది పేరుకే ఫేమస్ morine bakery అని తిను బండారాల నాణ్యత మాత్రం డొల్ల అని స్థానికులు చెప్తున్నారు. తక్షణమే బేకరీపై చర్యలు తీసుకోవాలని  వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.

ALSO READ | Alcohol Cold Drink: కొంపదీసి మందులో కూల్ డ్రింక్ మిక్స్ చేసుకుని తాగుతున్నారా..? ప్లీజ్ స్టాప్..