NCERT బుక్స్‌ రివైజ్..పాఠంలో పూర్తిస్థాయి అయోధ్య ప్రస్తావన

NCERT బుక్స్‌ రివైజ్..పాఠంలో పూర్తిస్థాయి అయోధ్య ప్రస్తావన

NCERT బుక్స్‌ని రివైజ్ చేస్తున్నారు.ఎన్నో ఏళ్లుగా ఉన్న పాఠాలను తొలగిస్తున్నారు. కొత్తవి చేర్చుతున్నారు. ఇందులో భాగంగా 12వ తరగతికి చెందిన పొలిటికల్ సైన్స్‌ బుక్‌లో బాబ్రీ మసీద్‌ పాఠాన్ని తొలగించారు. ఈ టాపిక్‌ని తొలగించి అయోధ్య వివాదాన్ని చేర్చడం చర్చకు దారి తీసింది. 

అంతకు ముందు అయోధ్య వివాదానికి (Ayodhya Dispute) సంబంధించి మొత్తం నాలుగు పేజీల పాఠం ఉండేది. ఇప్పుడు దాన్ని కుదించి రెండు పేజీలకే పరిమితం చేసింది. కొన్ని కీలక వివరాలను తొలగించి రెండు పేజీలకే పరిమితం చేసినట్లు తెలుస్తోంది. 
 మొఘల్ కాలంలో 1528లో రాముడి జన్మభూమిలో బాబ్రీ మసీదు నిర్మించారని చరిత్ర చెబుతోంది. అయితే...ప్రాంతంలో హిందువులకు సంబంధించిన చిహ్నాలున్నాయని తేలింది. దీన్ని బట్టి అది హిందువులకు చెందిందే అన్న వాదన మొదలైంది. 

ఆ తరవాత 500 ఏళ్ల పాటు ఈ వివాదం కొనసాగింది. మొత్తానికి ఈ వివాదానికి తెర పడి రామ మందిర నిర్మాణం కూడా పూర్తైంది. ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోదీ బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని ప్రారంభించారు. NCERT బుక్‌లో బాబ్రీ మసీదుకి సంబంధించిన చరిత్రను తొలగించి కేవలం అయోధ్య వివరాలు మాత్రం ప్రచురించారు.