ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ

ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ
  • వినతులు స్వీకరించిన కలెక్టర్లు, అధికారులు

సంగారెడ్డి టౌన్, వెలుగు : ప్రజావాణికి వచ్చే దరఖాస్తులకు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్​క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్​లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు 55 దరఖాస్తులు అందించారు. వీటిలో రెవెన్యూ 35, మార్క్​ఫెడ్​2, సర్వే ల్యాండ్ రికార్డ్ 2, పంచాయతీ పీటీ విభాగం 2, పంచాయతీరాజ్ 1, డీఆర్డీవో 3, పురపాలక సంఘం 6. 

విద్యాశాఖ1, ఎక్సైజ్ 2, రవాణా శాఖ నుంచి ఒక ఫిర్యాదు ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న సమస్యలను ఆన్​లైన్​లో అప్​లోడ్​చేయాలన్నారు. ఈ సందర్భంగా రుణమాపీ కానీ రైతులు కలెక్టర్​కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్​వో పద్మజారాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.

సిద్దిపేట టౌన్ : సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే విధంగా అధికారులు పని చేయాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. సిద్దిపేట కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో  అర్జిదారుల నంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి గొప్ప కార్యక్రమమని, సామాన్యులకు అందుబాటులో ఉండి సమస్యలను విన్నవించుకుని పరిష్కరించుకోవడానికి చక్కని వేదిక అన్నారు. 

ఈ సందర్భంగా నకిలీ విత్తనాలు అమ్మి పంట నష్టపోవడానికి కారణమైన సీడ్స్ షాప్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ దుద్దెడ గ్రామానికి చెందిన పాతల రాములు అడిషనల్ కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ప్రజావాణికి భూ సంబంధిత, డబుల్ బెడ్ రూం, ఆసరా, తదితర సమస్యల పై 22 దరఖాస్తులు వచ్చినట్లు అడిషనల్​ కలెక్టర్​తెలిపారు. డీఆర్ వో లక్ష్మి కిరణ్, డీఆర్డీవో జయదేవ్ ఆర్యా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.