వినూత్నంగా మిడ్ డే మీల్స్ కార్మికుల నిరసన

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో మిడ్ డే మీల్స్ కార్మికురాలు వినూత్నంగా నిరసన తెలిపారు. పూనకం వచ్చి ఎల్లమ్మ తల్లి రూపంలో దేవుడు వచ్చినట్లు ఓ కార్మికురాలు నిరసన తెలిపింది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం.. ఏడు రోజుల నుంచి టెంట్ల కింద కూర్చుని నిరసన తెలియజేస్తున్నామని మిడ్ డే మీల్స్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణలో కేసీఆర్ అన్ని బాధలను తీరుస్తాడని పూనకంతో చెప్పింది. 

తొమ్మిదేళ్ల నుంచి తమ సమస్యలను కేసీఆర్ ఇంకా ఎప్పుడు పరిష్కరిస్తారని ఓ కార్మికురాలు ప్రశ్నించింది. మరో రెండు నెలల్లో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాడని పూనకం వచ్చిన మహిళ తెలిపింది. తొమ్మిదేళ్ల నుంచి లేనిది ఇప్పుడు తమ సమస్యలు తీరుస్తాడా...?  అంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీతో కేసీఆర్ కు అవసరం పడ్డది.. ఇప్పుడు మీ డిమాండ్లు నెరవేరుస్తాడు అంటూ పూనకం వచ్చిన మహిళ చెప్పింది.