నెల్సన్: టార్గెట్ ఛేజింగ్‌లో హెన్రీ నికోల్స్ (95), విల్ యంగ్ (89), రచిన్ రవీంద్ర (45) చెలరేగడంతో.. బుధవారం జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మరోటి మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. టాస్ ఓడిన బంగ్లాదేశ్ 49.5 ఓవర్లలో 291 రన్స్‌కు ఆలౌటైంది.
ఓపెనర్ సౌమ్య సర్కార్ (151 బాల్స్‌లో 22 ఫోర్లు, 2 సిక్స్‌లతో 169 నాటౌట్) కెరీర్ బెస్ట్ స్కోరు సాధించాడు. ముష్ఫికర్ రహీమ్ (45) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. కివీస్ బౌలర్లలో జాకబ్ డుఫీ, విలియమ్ ఓ రూర్కీ చెరో మూడు వికెట్లు తీశారు. తర్వాత న్యూజిలాండ్ 46.2 ఓవర్లలో 296/3 స్కోరు చేసి గెలిచింది. తొలి వికెట్‌కు76 రన్స్ జోడించి రచిన్ రవీంద్ర ఔటైనా, విల్ యంగ్, నికోల్స్ రెండో వికెట్‌కు 128 రన్స్ జత చేసి ఆదుకున్నారు.
చివర్లో టామ్ లాథమ్ (34 నాటౌట్), టామ్ బ్లండెల్ (24 నాటౌట్) నిలకడగా ఆడారు. హసన్ మహ్ముద్ రెండు వికెట్లు తీశాడు. సౌమ్య సర్కార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన మూడో వన్డే శనివారం నేపియర్‌లో జరుగుతుంది.