ఈ ఫొటోలోని అమ్మాయిని చూశారా.. బాగా చూడండి..! మీకు ఏమనిపిస్తుంది చాలా అందంగా ఉంది.. ముచ్చటగా ఉందనుకుంటారు కదా..! పెళ్లి కాని వారు పరిచయమైతే పెళ్లి ప్రపోజల్ కూడా చేస్తేస్తారు.. ఇదంతా ఈ అమ్మాయి చూడగానే అనిపించే ఫీలింగ్స్. కానీ, ఈమె అసలు రూపం తెలిస్తే.. మాత్రం.. అమ్మ వగలాడి.. కిలాడీ.. దేశముదురు అంటారు.. ఈ అమ్మాయి చేతిలో మోసపోయిన బాధితుడి కథ వింటే మాత్రం.. మగాళ్లకు కన్నీళ్లు వస్తాయి.. ఇంతకీ ఈ అమ్మడు ఏం మోసం చేసిందో తెలుసుకుందామా..!
కర్నాటక రాష్ట్రం షాపూర్‌కు చెందిన శివ్‌భగత్ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి. రెండేళ్ల క్రితం భవిక భొయిర్ అనే మహిళతో పరిచయమైంది. ఆ తర్వాత అది కాస్తా ప్రేమగా మారింది. భవిక అంటే శివ్‌భగత్‌కు ప్రాణం. ట్విస్ట్ ఏంటంటే.. భవిక ప్రేమించింది శివ్‌భగత్‌ను కాదు.. అతని డబ్బుని. ఈ విషయం తెలియని శివ్‌భగత్.. భవిక పిలిచింది కదా అని ఆమె చెప్పిన ప్రదేశానికి వెళ్లాడు. వెళ్లేటప్పుడు ప్రియురాలు భవిక చెప్పినట్లు.. గోల్డ్ రింగ్, గోల్డ్ నెక్లెస్, కాస్ట్లీ షూస్ తో పాటు ఎంతో ముచ్చటగా ప్రియురాలు భవికకు ఖరీదైన బహుమతులు కొనుక్కుని వెళ్లాడు.
ఇద్దరు తన కారులో కూర్చున్నారు. కాస్త దూరం వెళ్లగానే మరో నలుగురు వ్యక్తలు వచ్చి బలవంతంగా కారులో ఎక్కారు. శివ్‌భగత్‌ను తీవ్రంగా కొడుతూ ఓ రెస్టారెంట్‌కు తీసుకువెళ్లారు. అప్పుడు అర్థమైంది అతనికి. ఇదంతా తన ప్రేయసి ప్లానే అని. మరో వ్యక్తి కోసం ప్రేయసి తనను మోసం చేసిందని అర్థం చేసుకున్నాడు. శివ్‌భగత్ తెచ్చిన గిఫ్ట్‌లన్నీ తీసుకున్న భవిక ఆమె స్నేహితులు పారిపోయారు. రాత్రంతా తీవ్రంగా కొట్టి.. ఒంటిపై దుస్తులు లేకుండా శివ్‌భగత్‌ను హైవే పక్కన డంప్‌లో పడేశారు. మరుసటి రోజు ఉదయం పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు శివ్‌భగత్‌ను గుర్తించారు. విషయం తెలుసుకుని.. హాస్పిటల్‌కు తరలించారు. నాలుగు రోజులు కోమాలో ఉన్న శివ్‌భగత్ తేరుకున్న తరువాత చెప్పిన మాటలు పోలీసులతో కూడా కంటతడి పెట్టించాయి.
భవిక ప్రేమలో మునిగిన తాను ఆమె కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు చెప్పాడు శివ్‌భగత్. తన కోసం షాపూర్‌లో ఇల్లు కూడా కట్టించానని, తన కోరిక మేరకు అన్నీ సమకూర్చానని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ.. భవిక మాత్రం వేరే వ్యక్తి కోసం తనను వదిలేసిందని చెప్పాడు. కేసు నమోదు చేసిన పోలీసులు భవికతో పాటు ఆమె ఫ్రెండ్‌ను అరెస్ట్ చేశారు. మరో నలుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. ఆలస్యంగా బయటికి వచ్చిన ఈ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. అంతలా ప్రేమించిన వ్యక్తిని మోసం చేసిందంటే ఆమె మనిషి కాదంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.