
- నలుగురికి గాయాలు
శివ్వంపేట, వెలుగు: రోడ్డుపై వడ్లు ఆరబోయడంతో ప్రమాదం జరిగి నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం మండలంలోని పెద్ద గొట్టిముక్కుల వద్ద జరిగింది. సర్పంచ్ బాలమణి, నరేందర్ దంపతులు, పిల్లతో కలిసి బైకుపై గోమారం వెళ్తున్నారు. పెద్ద గొట్టిముక్కుల గ్రామ శివారులో రోడ్డుపై వడ్లు ఆరబోసి ఉన్నాయి.
ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి బైక్ వడ్లమీదకి వెళ్లడంతో జారి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. గత శుక్రవారం కూడా నాగరాజు అనే యువకుడు రోడ్డుపై పోసిన వడ్ల కారణంగా బైక్ పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయంపై అధికారులు స్పందించి రైతులు రోడ్డుపై వడ్లు ఆరబోయకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.