జగిత్యాల కలెక్టరేట్​లో బతుకమ్మ సంబురాలు

జగిత్యాల రూరల్, వెలుగు: బతుకమ్మ సంబరాల స్ఫూర్తితో రానున్న శాసనసభ ఎన్నికల్లో మహిళా ఉద్యోగులు భాగస్వాములు కావాలని జిల్లా ఎన్నికల అధికారిని, కలెక్టర్ యాస్మిన్ భాష పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్ ఆవరణలో స్వీప్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ బీఎస్‌‌ లత, మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు.