శ్రీశైలం,వెలుగు; శ్రీశైలంలోని పాతాళగంగలో మెట్ల మార్గంలో నీటి కుక్కలు సందడి చేశాయి. పాతాళగంగకు భక్తులు వెళ్లి వచ్చే దారిలో టూరిజం శాఖ ఏర్పాటు చేసిన జెట్టిపై ఆడుతూ అటుగా వెళ్లే యాత్రికులకు కనువిందు చేశాయి.
ఎగువన వర్షాలు పడినప్పుడు, నీళ్లు పెరిగినా లేదా డ్యామ్ లో నీటిమట్టం తగ్గిన సమయంలో శ్రీశైలం జలాశయం పరిసరాల్లో చేపల కోసం ఒడ్డుకు వస్తాయి. పాతాళగంగ వద్ద ఏపీ టూరిజం ఏర్పాటు చేసుకున్న జెట్టిపై విన్యాసాలు చేస్తూ కనువిందు చేస్తుంటాయి. నీటి కుక్కలు సాధారణంగా మనిషి కనపడినా, శబ్దం చేసిన తుర్రుమంటాయి. కాగా మెట్ల మార్గంలో కనిపించిన నీటి కుక్కలను యాత్రికులు సెల్ఫోన్లో బంధించారు.