సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శుక్రవారం దేవతల విగ్రహాల శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీకోదండరామ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఈనెల 20న సీతారాములు, అన్నపూర్ణ సమేత బోలా లింగేశ్వర స్వామి, వాసవి కన్యకా పరమేశ్వరి , వేంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు, ఆంజనేయ స్వామి, ఆల్వారులు విగ్రహలను ప్రతిష్ఠించనున్నారు.
ఈ విగ్రహాలను నిర్వాహకులు నాగుబండి రామ్మూర్తి నగర్ నుంచి శోభాయాత్రగా దేవాలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. శనివారం నుంచి హోమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తలు నాగు బండి రంగా రంగనాథ్ తెలిపారు. ఈ శోభాయాత్రలో కమిటీ సభ్యులు వెంకటనారాయణ
పైడిమర్రి నారాయణరావు, పందిరి సత్యనారాయణ, మేళ్లచెరువు కోటేశ్వరరావు, గరిడేపల్లి లక్ష్మణరావు, పట్టణ ప్రముఖులు తెల్లాకుల వెంకటేశ్వర్లు, ఇరుకుల్లా చెన్నకేశవరావు, ఇమ్మడి రమేశ్, గరిన శ్రీధర్, బొలిశెట్టి కృష్ణయ్య పాల్గొన్నారు.