తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ ఈరోజు నుంచి ప్రారంభమైయ్యాయి. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియేట్ బోర్డు 33 జిల్లాల్లో మొత్తం 1521 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. మొదటి సంవత్సరం విద్యార్థులు ఈరోజు (ఫిబ్రవరి 28)న సెకండ్ ల్యాంగువేజ్ పేపర్ 1 పరీక్షకు హాజరైయ్యారు. సెకండ్ ఇయర్ స్టూడెట్స్ కు గురువారం (ఫిబ్రవరి 29) నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. ఇంటర్మీడియేట్ చదివే మొత్తం 9లక్షల 80వేల 978 మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి అప్లై చేసుకున్నారు. అందులో 4లక్షల 78వేల 718 మంది ఫస్ట్ ఇయర్, 5లక్షల 2వేల 260మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు.
ఈ పరీక్షలకు 27వేల 900 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తున్నారు.కొన్ని చోట్లు ఎగ్జామ్ టైం కంటే ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించడలేదు. ఎగ్జామ్ సెంటర్ల దగ్గర పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల ప్రాంతాల్లో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసివేశారు. మాస్ కాపీయింగ్ జరగకుండా, చీటింగ్ ను నివారించడానికి 75 ఫ్లైయింగ్ స్క్వాడ్ టీంలు , 200 సిట్టింగ్ స్క్వాడ్ టీంలు డ్యూటీలో ఉన్నాయి. మార్చి 19 వరకు పరీక్షలు కొనసాగుతాయి.