కొత్త డిజైన్ లో యాపిల్ 15 సిరీస్

కొత్త డిజైన్ లో యాపిల్ 15 సిరీస్

మార్కెట్ లోకి ఎన్ని మొబైల్స్ వచ్చినా యాపిల్ ఫోన్ కు మాత్రం సపరేట్ క్రేజ్ ఉంటుంది. వాటి ధరలు ఆకాశానికి అంటుతున్నా యాపిల్ ఫోన్లు కొనడానికి చాలామంది మొగ్గు చూపుతుంటారు. అయితే, కొన్ని ఫీచర్లు, ప్రాసెసర్ మార్చుతూ ఐఫోన్ 12,13,14 సిరీస్ లు తీసుకొచ్చినా.. వాటి డిజైన్ మాత్రం ఇంచుమించు ఐఫోన్ 12 లాగానే ఉన్నాయి. దీంతో యాపిల్ ఫ్యాన్స్ కంపెనీని తీవ్రంగా ట్రోల్స్ చేశారు. అందుకే, వచ్చే ఏడాది తీసుకురాబోయే 15 సిరీస్ లో కొన్ని చేంజెస్ తీసుకురాబోతోంది. 

ఐఫోన్ 12,13,14 సిరీస్ లు ఫ్లాట్ డిజైన్, షార్ప్ ఎడ్జెస్ తో వచ్చాయి. ఇప్పుడు తీసుకురాబోయే 15 సిరీస్ లో ఆ డిజైన్ మార్చి, కర్వ్డ్ ఎడ్జెస్ ని తీసుకొస్తున్నారు. దీనివల్ల చేతికి ఇబ్బంది లేకుండా ఫోన్ గ్రిప్ బాగుంటుందని చెప్తున్నారు. ఇదేకాకుండా.. బటన్స్ లేకుండా హ్యాప్టిక్ టచ్ తో తీసుకొస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. లైటెనింగ్ ఛార్జింగ్ పోర్ట్ కి బదులుగా టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ తో తీసుకొస్తున్న విషయం తెలిసిందే.