హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం బడ్జెట్ లో రూ.5790 కోట్లను కేటాయించింది. గ్రామాల నుంచి మండలాలకు, అక్కడి నుంచి జిల్లాలకు, జిల్లాల నుంచి రాజధానికి రోడ్లు వేస్తామని ఆర్థిక మంత్రి భట్టి తెలిపారు. అలాగే కంటోన్మెంట్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు.
మేజర్ జిల్లా రోడ్ల నిర్మాణానికి రూ.2988.67 కోట్లు, రేడియల్ రోడ్లకు రూ.57 కోట్లు, గజ్వేల్ అథారిటీ, మెదక్ జిల్లాలో రోడ్ల అభివృద్ధికి రూ.10 కోట్లు, మండలాల నుంచి జిల్లా రోడ్లకు రూ.50 కోట్లు, రూరల్ రోడ్లకు రూ.90 కోట్లు, మావోయిస్టు ప్రాంతాల రోడ్లకు రూ.4 కోట్లు, ఆర్ వో బీలకు రూ.120 కోట్లు, కొత్త కలెక్టరేట్లకు రూ.30 కోట్లు కేటాయించామని, ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకు రూ. 1525 కోట్లు కేటాయించామని చెప్పారు.