ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. 6.4 శాతం ఆర్థికవృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో..  6.4 శాతం ఆర్థికవృద్ధి

న్యూఢిల్లీ: గ్రామీణ,  పట్టణ ప్రాంతాలలో  డిమాండ్ మళ్లీ పెరుగుతున్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనదేశ ఆర్థిక వృద్ధి అంచనాను 6.4 శాతం వద్దే కొనసాగిస్తున్నట్టు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ప్రకటించింది.  ప్రపంచ మార్కెట్లలో మందగమనం కారణంగా ఎగుమతులు తగ్గే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. 2022–-23లో భారత ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం వృద్ధి చెందింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇన్​ఫ్లేషన్​ అంచనాను ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5 శాతం నుంచి 4.9 శాతానికి తగ్గించింది. ముడి చమురు ధరలను తగ్గించడంతో ధరల భారం తక్కువ అవుతుందని ఆసియన్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుక్ (ఏడీఓ) రిపోర్ట్​లో పేర్కొంది.  సాధారణ వర్షపాతం కొనసాగుతూ  భౌగోళిక, రాజకీయ ఇబ్బందులు లేకుంటే ఈ ఏడాది ఏప్రిల్లో అంచనా వేసినట్లుగా భారతదేశం 2024 ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతం వృద్ధి చెందవచ్చని ఏడీబీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల్లో విశ్వాసం పెరిగింది. పట్టణ నిరుద్యోగం తగ్గుతోంది.  మోటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైకిళ్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. వీటిని బట్టి చూస్తే గ్రామీణ,  పట్టణ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుంజుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. 

 

పెట్టుబడులు బలంగా ఉంటాయని,  బ్యాంక్ క్రెడిట్ వృద్ధి, ఇండ్ల కోసం డిమాండ్,  సెంట్రల్ బ్యాంక్ తక్కువ వడ్డీ రేట్లు.. డిమాండ్​ను పెంచే అవకాశం ఉందని అంటున్నారు.  ఆహారం,  చమురు ధరలు కంట్రోల్​ అయినందున ఇన్​ఫ్లేషన్​ 6 శాతం అప్పర్​ టాలరెన్స్ స్థాయి కంటే తగ్గింది.2022లో చాలా వరకు రిటైల్ ఇన్​ఫ్లేషన్​ 6 శాతానికిపైగా ఉంది. తాజా డేటా ప్రకారం, జూన్ 2023లో ఇది 4.81 శాతంగా ఉంది.  ఆహారం,  ఇంధనం మినహా మిగతా వాటి ధరలు ఎక్కువగా ఉండొచ్చని ఏడీబీ తెలిపింది. ఆసియా,  పసిఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు 2023లో 4.8 శాతానికి పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. బలమైన డిమాండ్ ఈ ప్రాంతం పునరుద్ధరణకు సాయపడుతుందని తెలిపింది.   2024 వృద్ధి అంచనాను ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4.8 శాతం అంచనా నుండి 4.7 శాతానికి   సవరించింది.  ఈ ప్రాంతం నుంచి ఎలక్ట్రానిక్స్,  ఇతర తయారీ వస్తువుల ఎగుమతులకు డిమాండ్ మందగిస్తుందని అంచనా వేసింది. సేవల రంగంలో బలమైన దేశీయ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చైనా ఆర్థిక వ్యవస్థ 2023లో 5 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. 2024లో చైనా జీడీపీ 4.5 శాతం వృద్ధి చెందుతుందని ఏడీబీ భావిస్తోంది.