నిర్మాత కేపీ చౌదరి కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

డ్రగ్స్‌ కేసులో నిర్మాత కేపీ చౌదరి అరెస్టుతో సినీ ఇండస్ట్రీలో కలవరం మొదలైంది. కేపీ చౌదరి కస్టడీ రిపోర్టులో సంచనాల విషయాలు బయటపడ్డాయి. పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతల కుమారులకు డ్రగ్స్‌ అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. కేపీ చౌదరి నుంచి వందల కొద్ది కాల్స్ మాట్లాడిన ఆరుగురిలో ముగ్గురు సెలబ్రిటీలు ఉన్నారని తెలుస్తోంది. 

కేపీ చౌదరి గోవాలోని ఓ హోటల్ లో తరచుగా డ్రగ్ పార్టీలు ఇచ్చేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. కేపీ చౌదరి కాల్‌ లిస్ట్‌ను పోలీసులు డీకోడ్‌ చేస్తున్నారు. సినీ నటులతో కేపీ చౌదరి ఫోన్‌ సంభాషణలపైనా ఆరా తీస్తున్నారు. కేపీ చౌదరి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన వారికి, కాల్స్ మాట్లాడిన వారికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.