పీకలదాకా మద్యం తాగారు.. రక్తం కారే వరకూ తన్నుకున్నారు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో కొందరు యువకులు రోడ్డుపై వీరంగం సృష్టించారు. తాగిన మత్తులో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. రక్తాలు కారే వరకూ తన్నుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. 

సూర్యాపేట పట్టణానికి చెందిన సుమారు 10 మంది యువకులు జమ్మిగడ్డ క్రాస్ రోడ్డు సమీపంలోని ఓ దుకాణంలో మద్యం తాగారు. ఆ తర్వాత వీరంతా రెండు వర్గాలుగా విడిపోయి.. అదే మద్యం దుకాణం ఎదుట కొట్టుకున్నారు. నడిరోడ్డుపైనే ఒకరిపై మరొకరు పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు. రక్తాలు కారుతున్నా.. ఎవరూ వెనక్కి తగ్గలేదు. ఈ ఘటనకు మూడు రోజుల క్రితం జరిగింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.