- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు
సూర్యాపేట, వెలుగు: ప్రధానిగా మోడీ బాధ్యతలు తీసుకున్నాక వ్యక్తిగతంగా ప్రజలకు దగ్గరయ్యేందుకే మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం 101 మన్‌కీ బాత్ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోడీ యువ సమ్మేళనం ద్వారా వివిధ రాష్ట్రాలలో ఉన్న విద్యార్థులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని 25వ వార్డులో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో వార్డు ప్రజలతో కలిసి సంకినేని మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని చూశారు.
కార్యక్రమంలో పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు అయినాపురపు శ్యామల గౌరి, అసెంబ్లీ కన్వీనర్కర్నాటి కిషన్, పట్టణ అధ్యక్షులు అబీద్, పార్లమెంట్ కన్వీనర్ మన్మధ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చల్లమల్ల నరసింహ, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆరూరి శివ, సోషల్ మీడియా పార్లమెంట్ కన్వీనర్ కొప్పుల క్రాంతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.