ఆదుకున్న శ్రేయస్‌‌‌‌, పడిక్కల్‌‌‌‌.. రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో ఇండియా 206/8

ఆదుకున్న శ్రేయస్‌‌‌‌, పడిక్కల్‌‌‌‌.. రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో ఇండియా 206/8

అనంతపూర్‌‌‌‌‌‌‌‌/ బెంగళూరు: దులీప్‌‌‌‌ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్‌‌‌‌లో  ఇండియా–డి, సి జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి.  వరుసగా రెండో రోజు బౌలర్ల హవా నడిచి 14 వికెట్లు పడ్డాయి.  దేవదత్ పడిక్కల్ (54),  కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (54)కు తోడు రిక్కీ భుయ్ (44) సత్తా చాటడంతో శుక్రవారం చివరకు ఇండియా– డి రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో  206/8 స్కోరుతో నిలిచింది. అక్షర్ పటేల్ (11 బ్యాటింగ్‌‌‌‌), హర్షిత్ రాణా (0 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. 

ఇండియా–సి బౌలర్లలో మానవ్ సుతార్ ఐదు వికెట్లు పడగొట్టగా.. విజయ్‌‌‌‌ కుమార్ రెండు వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఇండియా–డి 204 రన్స్ ఓవరాల్ లీడ్‌‌‌‌లో ఉంది. అంతకుముందు ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 91/4తో తొలి ఇన్నింగ్స్‌‌‌‌ కొనసాగించిన ఇండియా–సి 168 స్కోరు వద్ద ఆలౌటైంది. నాలుగు రన్స్‌‌‌‌ ఆధిక్యమే దక్కించుకుంది. బాబా ఇంద్రజీత్ (74), అభిషేక్ పోరెల్ (34) రాణించారు. ఇండియా–డి బౌలర్లలో హర్షిత్ రాణా నాలుగు, అక్షర్, సరాన్ష్‌‌‌‌ జైన్ రెండేసి వికెట్లు తీశారు. 

ముషీర్, సైనీ జోరు

బెంగళూరు వేదికగా ఇండియా–ఎతో జరుగుతున్న మ్యాచ్‌‌‌‌లో ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 202/7తో ఆట కొనసాగించిన ఇండియా–బి 321 రన్స్ వద్ద ఆలౌటైంది. ముషీర్ ఖాన్ (181) భారీ సెంచరీతో రాణించగా, సాయి కిశోర్ (56) ఆకట్టుకున్నాడు. అకాశ్ దీప్ నాలుగు, ఖలీల్‌‌‌‌, అవేశ్ ఖాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన ఇండియా–ఎ రెండో రోజు చివరకు 134/2 స్కోరుతో నిలిచింది. రియాన్‌‌‌‌ పరాగ్ (27 బ్యాటింగ్‌‌‌‌), కేఎల్ రాహుల్ (23 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (36), గిల్ (25)ను నవ్‌‌‌‌దీప్ సైనీ ఔట్‌‌‌‌ చేశాడు.