కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) అనేది ఒక పాలనాపరమైన ప్రక్రియ. ఒకవేళ కనీస మద్దతు ధరను తొలగించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమైతే సంస్కరణల్లో భాగంగా ఈ మూడు చట్టాలు తీసుకు రావాల్సిన అవసరమేముంది? ఒకవేళ ఎంఎస్పీని తొలగించే ఉద్దేశమే ఉంటే ఐదేండ్లుగా దాన్ని పెంచుకుంటూ రావాల్సిన పనేముంది? 2015లో రాహుల్ గాంధీ లోక్‌సభలో రైతుల నష్టాల గురించి మాట్లాడుతూ “కొన్నేండ్ల కిందట ఒక రైతు నన్నడిగాడు. తాను బంగాళాదుంపలు కిలో 2 రూపాయలకు అమ్ముతుంటే చిప్స్ రూ.10 కి అమ్మడమేంటని. మనం ఉత్పత్తులు నేరుగా ఫ్యాక్టరీలకే ఇస్తే, అప్పుడు మధ్య దళారీలు లాభపడే అవకాశం ఉండదు” అన్నారు. ఇప్పుడు కేంద్రం కూడా అదే చేయాలనుకుంటోంది.
భూమికి రైతులే పరిరక్షకులు, యజమానులు
రైతుల భూములను కార్పొరేట్ సంస్థలు తీసేసుకుంటాయంటూ నిరాధార, నిందాపూర్వక అబద్ధాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కొత్త అగ్రి చట్టాలు అంచెలంచెలుగా మన రైతులకు నిర్దిష్టమైన రక్షణలు కల్పిస్తున్నాయి. ఆ విధంగా కార్పొరేట్ సంస్థలు ఉద్దేశపూర్వకంగా భూమి మీద హక్కు కోరకుండా రైతులకు చట్టపరమైన రక్షణ కల్పించాం. పైగా, రైతుల నుంచి భూముల కొనుగోలు, కౌలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని చట్టాల్లో స్పష్టంగా చెప్పాం. మన రైతులే భూమికి, మట్టికి, అడవికి యజమానులు, పరిరక్షకులు. నిజం చెప్పాలంటే వాళ్లకి భూమి తల్లిలాంటిది. దాని సంరక్షణ కోసం వారు చెమట, రక్తం ధార పోసి జీవితాలను అంకితం చేశారు. వాళ్ల తల్లి వాళ్ల చేతుల్లో సురక్షితంగా ఉంటుంది. రైతుల భూములను రైతుల నుంచి తీసుకోవటాన్ని మేం అనుమతించే ప్రసక్తే లేదు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కార్పొరేట్ అవసరం
కార్పొరేట్ సంస్థలు ఈరోజు అనేక రంగాలకు విస్తరించాయి. అయితే, వాటిలో వ్యవసాయ రంగం అనేది కచ్చితంగా అత్యంత లాభదాయకమైన రంగమేమీ కాదు. అందువల్ల కార్పొరేట్ సంస్థలు వచ్చి మన రైతుల శ్రమను దోచుకుంటాయని అనటం అర్థం లేని విషయం. వ్యవసాయ సరఫరాల గొలుసుకట్టులో పెట్టుబడి కారకాలను, ఉత్పత్తులను పరీక్షించటం, ఉత్పత్తిలో శాస్త్రీయ విధానాలు అవలంబించటం, అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉంచటం ద్వారా ఉత్పత్తుల విలువ పెంచటానికి, మన భవిష్యత్ తరాలకు అత్యంత అవసరమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కోలుకోవటానికి మాత్రమే కార్పొరేట్ సంస్థలు మనకు అవసరం.
అమూల్ విజయగాథ అందరికీ స్ఫూర్తి కావాలి
అమూల్ సహకార సంస్థ ఒక విజయగాథతో మనముందు కనిపిస్తూనే ఉంది. చెదురుమదురుగా చిన్న చిన్న పాల ఉత్పత్తిదారులు ఉన్న రంగంలో కూడా ప్రజలు సంఘటితమై ఒక అద్భుతమైన విజయగాథని లిఖించటం సాధ్యమని రుజువు చేసింది. ఈ రోజు అమూల్ కేవలం పాల ఉత్పత్తికే పరిమితం కాలేదు. దాని ఆదాయంలో అత్యధిక భాగం ప్రాసెస్డ్ ఆహార పదార్థాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయటం ద్వారా వస్తున్నదే. ఈ సంస్కరణల ద్వారా మన రైతులు ఇలాంటి విజయాన్ని దక్కించుకోవాలన్నదే మన కోరిక. మన ప్రభుత్వం 10 వేల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసింది. ఇవి చిన్న, సన్నకారు రైతులను సంఘటితం చేసి సామాజిక పెట్టుబడి, బేరమాడే శక్తిని కలిగిస్తాయి.
కిసాన్ సమ్మాన్ తో రైతులకు చేయూత
రైతులకు మేలు చేసే దిశగా కేంద్రం ఇంకా అనేక చర్యలు తీసుకుంటోంది. రైతులు తమ ఉత్పత్తులను 50–100 కిలోలైనా సరే ఏసీ రైలు పెట్టెల్లో రవాణా చేసుకోవటానికి వీలు కల్పిస్తూ ప్రధాని మోడీ ఇటీవలే 100వ కిసాన్ రైలును ప్రారంభించారు. రూ.లక్ష కోట్ల వ్యవసాయ మౌలిక వసతుల నిధి ఏర్పాటు ద్వారా గిడ్డంగులు, శీతల నిల్వ కేంద్రాలు, నాణ్యతాపరంగా వేరు చేయటం, ప్యాక్ చేయటం, గ్రామీణ మార్కెటింగ్ వేదికలు, ఈ–మార్కెటింగ్ యూనిట్లు వంటి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావటం వీలవుతుంది. చిన్న, సన్నకారు రైతులు తమ గౌరవాన్ని, మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ఉండేందుకు కిసాన్ సమ్మాన్ నిధిని కేంద్రం ఏర్పాటు చేసింది. దీనికింద ఇప్పటికే రూ.1,10,000 కోట్లు చెల్లించాం. దీని ద్వారా కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోగలిగాం. పీఎం కిసాన్ ఫసల్ బీమా యోజన పేరుతో ఒక సమర్థవంతమైన పంటల బీమా విధానాన్ని రూపొందించి.. దీనికింద రూ.17,450 కోట్ల ప్రీమియం చెల్లించగా రైతులకు రూ.87,000 కోట్ల బీమా సొమ్ము అందింది.
రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నాలు
సిక్కు గురువుల నుంచి తరచూ స్ఫూర్తి పొందే ప్రధాని మోడీ జప్ జీ సాహెబ్ 38వ పౌరిని అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. కొత్త అగ్రి చట్టాల అమలుతో వ్యవసాయాన్ని బంగారంగా మార్చి, దానిని అందమైన ఆభరణాలుగా తీర్చిదిద్దే స్వర్ణకారునిలా పూర్తి అంకితభావంతో స్వచ్ఛమైన హృదయం, పట్టుదల, ఓర్పుతో రైతు సోదరసోదరీమణుల సంక్షేమం కోసం ప్రధాని కృషి చేస్తున్నారు. రైతుల జేబుల్లో మరింత డబ్బు పెట్టాలని, అప్పుల ఊబి నుంచి వారిని బయటికి లాగాలని, సంపద సృష్టికి కొత్త మార్గాలు చూపాలని, ఉపాధి కల్పించాలని ప్రయత్నిస్తున్నారు. కార్పొరేట్ రంగంతో పాటు ప్రతి ఆర్థిక సంబంధ వ్యవస్థలనూ ఇందుకోసం వాడుకుంటూ రైతులకు లబ్ధి చేకూర్చాలన్నదే ఆయన లక్ష్యం. కష్టించి పనిచేసే మన రైతులు వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రాలను ప్రపంచానికే ధాన్యాగారాలుగా మార్చగల సమర్థులు. వాళ్లకు మద్దతునిచ్చే ఎకో సిస్టమ్స్ సృష్టించి వారిని ఆత్మ నిర్భర్ చేయటమే వ్యవసాయ సంస్కరణల అభిమతం.
దళారుల వల్లే అసంఘటితంగా
మన దేశపు ధాన్యాగారాలుగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఉన్నాయి. జాతీయ ఆహారోత్పత్తిలో దాదాపు 30% వాటా ఆ రాష్ట్రాలదే. ధాన్యం సేకరణకు కనీస మద్దతు ధర రూపంలో మనం చెల్లించే మొత్తంలో 70% వాటా ఈ రాష్ట్రాలకే వెళుతోంది. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బాంక్(నాబార్డ్) 2018 లో జరిపిన సర్వే ప్రకారం మొత్తం రైతుల్లో 52.5% అప్పుల్లో కూరుకుపోయారు. సగటు అప్పు 1,470 డాలర్లుగా లెక్కించింది. అదే సమయంలో పండిన పంటలో దాదాపు 30% నిల్వకు తగిన శీతల గిడ్డంగి సౌకర్యం లేకపోవటం వల్ల వృధా అవుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు వంటివి సులభంగా దెబ్బతింటున్నాయి. భారీ లాభాలు సంపాదించుకునే అనేకమంది మధ్య దళారుల కారణంగా వ్యవసాయ రంగం అసంఘటితంగా ఉండిపోయింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వ్యవసాయ సంస్కరణల అవసరాన్ని, అందులోని తర్కాన్ని, వాటి పరిణామక్రమాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వీటికి సంబంధించి ప్రస్తుతం ఎన్నో అబద్ధాలు, పుకార్లు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఇలా ఎక్కువగా ప్రచారం జరుగుతున్న కట్టుకథల్లో ‘‘కనీస మద్దతు ధర తొలగిస్తారు” అన్నది కూడా ఒకటి. ఇదంతా పనిగట్టుకుని చేస్తున్న ప్రచారం. ఇందులో ఎలాంటి నిజం లేదు. ఉత్పత్తి వ్యయానికి 1.5 రెట్లు ఉండేలా కనీస మద్దతు ధర నిర్ణయించాలన్న స్వామినాథన్ కమిటీ సిఫార్సును అమలు చేయటానికి మాత్రమే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పరిమితం కాలేదు. అన్ని పంటల కనీస మద్దతు ధరను 40–70% మేరకు పెంచింది. అలాగే 2009–14 మధ్య కాలం కంటే 2014–19 మధ్య వ్యవసాయోత్పత్తుల సేకరణ మీద 85% అధికంగా ఖర్చు చేసింది. ఇదే కాలంలో వ్యవసాయ శాఖ బడ్జెట్ కూడా ఆరు రెట్లు పెరిగింది.
– హర్‌దీప్ సింగ్ పూరి, కేంద్ర మంత్రి
వ్యవసాయం బంగారం అయితది
- వెలుగు ఓపెన్ పేజ్
- December 31, 2020
లేటెస్ట్
- విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ
- బుద్వేల్లో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన DCM
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- హైదరాబాద్ నడిబొడ్డున రూ.11 లక్షల నకిలీ సిగరెట్లు సీజ్
- బీర్ల ధరల పెంపు.. కొత్త బ్రాండ్ బీర్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- తిండైన మానేస్తారు కానీ వాళ్ళు అది మాత్రం ఆపరు: రాశీ కన్నా
- షమీ వచ్చేశాడు.. ఇక వార్ వన్ సైడే: 14 నెలల తర్వాత భారత జట్టులోకి రీ ఎంట్రీ
- గుండెపోటుతో తాటిచెట్టుపైన గీతకార్మికుడు మృతి
- IND vs ENG: ఇంగ్లండ్తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- బుజ్జితల్లి వీడియో సాంగ్ రిలీజ్.. ఎమోషనల్ ట్రీట్ ఇచ్చారుగా..
Most Read News
- చేతిలో ఇంకో జాబ్ ఆఫర్ లేదు.. ఇన్ఫోసిస్లో జాబ్ మానేశాడు.. ఎందుకని అడిగితే 6 రీజన్స్ చెప్పాడు..!
- Fateh Box Office: గేమ్ ఛేంజర్కు పోటీగా సోనూ సూద్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
- కొత్త రేషన్ కార్డుల జారీకి పక్కాగా అర్హుల ఎంపిక: కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- జనవరి 26 నుంచి పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- IND vs ENG: ఇంగ్లండ్తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- Video Viral: జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుపై వెళ్తున్నా కనీసం పట్టించుకోని జనం.. ఎక్కడంటే.?
- తెలంగాణ తెల్ల కల్లు, మటన్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
- Good Health: రోజూ 2 ఖర్జూర పండ్లతో కలిగే 6 లాభాలు..
- Daaku Maharaj: డాకు మహారాజ్ బుకింగ్స్ ఓపెన్.. టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే?
- కాంటినెంటల్ హాస్పిటల్లో అరుదైన సర్జరీ