హనుమాన్ టెంపుల్లో మాంసం ముద్దల కలకలం..ఖంగుతిన్న భక్తులు

హనుమాన్ టెంపుల్లో మాంసం ముద్దల కలకలం..ఖంగుతిన్న భక్తులు

హైదరాబాద్ పరిధిలోని ఓ టెంపుల్ లో మాంసం ముద్దల ప్రత్యక్షం  కలకలం రేపుతోంది. ఆంజనేయ స్వామి టెంపుల్ లోని శివుని లింగం వద్ద మాంసం చూసి భక్తు లు ఖంగుతిన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు  చేస్తున్నారు.

హైదరాబాద్ నగర పరిధిలోని టప్పాచబుత్ర హనుమాన్ ఆళయంలో ఈ ఘటన జరిగింది. బుధవారం ( ఫిబ్రవరి 12)  ఉదయం ఆలయంలోని ఉప ఆలయం శివాలయంలో పూజలు నిర్వహించేందుకు వచ్చిన భక్తుకలకు శివుని వద్ద మాంసం కనిపించింది. దీంతో భక్తులు అవాక్కయ్యారు. వెంటనే తేరుకొని గుడి పూజారికి, ఆలయ నిర్వాహకులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు. 

హనుమాన్ ఆలయంలో మాంసం ముద్దల ప్రత్యక్షం సమాచారంతో భారీ ఎత్తున హిందూసంఘాల కార్యకర్తలు ఆలయానికి చేరుకున్నారు. మాంస పడేసిన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.