లక్నో: ఇండియా స్టార్ షట్లరు పీవీ సింధు.. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్–300 టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు 21–10, 12–2121–15తో వరల్డ్ 147వ ర్యాంకర్ ఐరా శర్మ (ఇండియా)పై చెమటోడ్చి నెగ్గింది. 49 నిమిషాల మ్యాచ్‌లో చివరి రెండు గేమ్‌ల్లో సింధుకు.. ఐరా గట్టి పోటీ ఇచ్చింది. అయితే ఎక్స్‌పీరియెన్స్ లేకపోవడంతో మ్యాచ్‌ను అనుకూలంగా ముగించలేకపోయింది. మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్ 21–14, 21–13తో డానిల్ డుబువెంకో (ఇజ్రాయిల్)పై నెగ్గాడు. విమెన్స్ డబుల్స్‌లో ట్రీసా జోలీ–గాయత్రి గోపీచంద్ 21–13, 21–10తో అశ్విన్ భట్–శిఖా గౌతమ్‌పై, తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప 21–9, 8–21, 21–12తో చెన్ సు యు–యి యెన్ సీహ్ (చైనీస్‌తైపీ)పై గెలవగా, మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–సుమిత్ రెడ్డి 21–19, 16–21, 13–21తో లూ బింగ్ కున్–హో లు యి (మలేసియా) చేతిలో, రోహన్ కపూర్–రుత్విక శివాని 18–21, 19–21తో లియావో పిన్ యి–హుయాంగ్ కి జిన్ (చైనా) చేతిలో కంగుతిన్నారు.