మ్యాన్‍హోల్‍ క్లీనింగ్‍ ఘటనలో.. ఇద్దరిపై సస్పెన్షన్‍ వేటు

వరంగల్‍, వెలుగు: గ్రేటర్ వరంగల్‍ కార్పొరేషన్‍ పరిధిలో మ్యాన్‌‌‌‌హోల్‍లోకి సఫాయి కార్మికుడిని దించి మురుగు క్లీన్‍ చేయించిన ఘటనలో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు పడింది. శానిటరీ ఇన్‌‌‌‌స్పెక్టర్‍ పి.భాస్కర్‍, జవాన్‍ రవి రూల్స్‌‌‌‌కు విరుద్ధంగా వ్యవహరిం చినట్లు తేలడంతో వారిపై బల్దియా అధికారులు చర్యలు తీసుకున్నారు. 

హనుమకొండ 5వ డివిజన్‍ పరిధిలోని కుమార్‍పల్లి ఏరియాలో ప్రవాహానికి చెత్త అడ్డుపడటంతో.. క్లీన్ చేయించేందుకు సఫాయి కార్మికుడైన ప్రసాద్‌‌‌‌ను మ్యాన్‌‌‌‌హోల్‌‌‌‌లోకి దించారు. అతడు మురుగు నీటిలో పూర్తిగా మునిగి అతి కష్టం మీద చెత్తను తీసిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోమవారం సోషల్‍ మీడియాలో వైరల్‍ అయ్యాయి.

 ఈ ఘటనపై ‘మల మూత్రాలు పారుతున్న డ్రైనేజీలోకి కార్మికుడిని దింపిన్రు’ పేరుతో మంగళవారం వార్తను ‘వెలుగు’ ప్రచురించింది. విషయం ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఇద్దరిపై వేటు వేశారు.